Esic Jobs : హైదరాబాద్ ఈఎస్ఐసీలో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్ లో మెడికల్ పీజీ డిగ్రీ , పీజీ డిప్లొమా (ఎండీ, ఎంఎస్, పీహెచ్ డీ) ఉత్తీర్ణులైన వారు అర్హులు.

Esic Hyderabad
Esic Jobs : భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ సనత్ నగర్ లోని ఎంప్లాయిూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన 311 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్టులు, జూనియర్ కన్సల్టెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, రిసెర్చ్ సైంటిస్టులు తదితరాలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్ లో మెడికల్ పీజీ డిగ్రీ , పీజీ డిప్లొమా (ఎండీ, ఎంఎస్, పీహెచ్ డీ) ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపిక విధానం విషయానికి వస్తే అకడమిక్ మెరిట్ టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్ 2021 అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 03, 2022 న ప్రారంభమౌతుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 17, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.esic.nic.in సంప్రదించగలరు.