Replacement : ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

జనరల్‌ సర్వీస్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్బర్వర్‌, పైలట్‌, ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

Replacement : ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Indian Navy

Updated On : February 24, 2022 / 10:55 AM IST

Replacement : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 155పోస్టులను భర్త చేయనున్నారు. బ్రాంచిల వారీగా ఖాళీలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో 88 ఖాళాలు, ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో 17 , టెక్నికల్ బ్రాంచ్ లో 45 ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులకు అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

జనరల్‌ సర్వీస్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్బర్వర్‌, పైలట్‌, ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం విషయానికి వస్తే షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2022, ఫిబ్రవరి 5 వతేదిన ప్రారంభమౌతుంది. 2022, మార్చి 12 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in/ సంప్రదించగలరు.