HURL JOBS : హెచ్ యూఆర్ ఎల్ లో ఖాళీ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

HURL JOBS : హెచ్ యూఆర్ ఎల్ లో ఖాళీ పోస్టుల భర్తీ

Hurl Jobs

Updated On : May 19, 2022 / 2:44 PM IST

HURL JOBS : హిందూస్ధాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్ యూఆర్ ఎల్ )లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 390 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టులలో జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్లు, ఇంజినీర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టోర్ అసిస్టెంట్లు తదితరాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటనేషన్, స్టోర్ , ఎన్వీరాన్ మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ లో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 24, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : WWW.hurl.net.in/పరిశీలించగలరు.