హైదరాబాద్ లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాలు

హైదరబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 29 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ టెక్నిషియన్(ప్రింటింగ్) – 26
ఫైర్ మెన్(రిసోర్స్ మేనేజ్ మెంట్) – 03
విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతి, ఐటీఐ పాసై ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్దుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్ధలు రూ.400 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 01,2020.
దరఖాస్తు చివరి తేది : పిబ్రవరి 02,2020.