SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు !
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 12, 13 తేదీల్లో ఉంటుంది.

Staff Selection Commission
SSC Stenographer : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నియామకాలను చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1207 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ 93 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ 1114 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Immunity Boosting : రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్!
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 12, 13 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన వారికి గ్రేడ్-సీ స్టెనోగ్రాఫర్స్ మూల వేతనం(బేసిక్ పే) రూ.14,500గా నిర్ణయించారు. ఇక గ్రేడ్-డీ వారికి రూ.7,600గా ఉంటుంది. బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
READ ALSO : Soft Drinks : రోజుకో గ్లాసు కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
స్టెనో గ్రాఫర్ విధులకు సంబంధించి వివిధ అంశాలకు చెందిన నోట్స్‌ను తయారు చేయటం ప్రధాన విధి. డ్రాఫ్ట్ స్పీచ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు నోట్ ప్రిపేర్ చేయడం, వ్యవస్థీకృత ఫైలింగ్ సిస్టమ్‌లను నిర్వహించడం, మంత్రులు, అధికారులకు అసిస్టెంట్‌గా వ్యవహరించడం వంటి పనులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. చివరి తేది ఆగస్టు 23గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ; https://ssc.nic.in/ పరిశీలించగలరు.