మే ఫస్ట్ వీక్‌లో 10వ తరగతి ఫలితాలు!

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 03:41 AM IST
మే ఫస్ట్ వీక్‌లో 10వ తరగతి ఫలితాలు!

Updated On : April 28, 2019 / 3:41 AM IST

పదో తరగతి పరీక్షా ఫలితాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్‌లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పరీక్షా పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. మొత్తం 11 కేంద్రాల్లో 52.55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. వాస్తవానికి ఏప్రిల్ నెలాఖరు వరకు ఫలితాలను రిలీజ్ చేయాలని అధికారులు అనుకున్నారు. అయితే..ఇంటర్ ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో 10వ తరగతి ఫలితాల విడుదలను వాయిదా వేసుకున్నారు. ఫలితాల్లో ఎలాంటి తప్పులు జరుగకుండా ఉండేందుకు ఒకటికి..రెండు సార్లు తనిఖీలు చేసుకున్నారు. 

మే 2 తర్వాత ఫలితాలు ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఫలితాల్లో ఎలాంటి సాంకేతిక పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. మూల్యాంకనం చేసే వారు తేదీని కూడా బబ్లింగ్ చేయాలన్నారు. దీనివల్ల ఏ రోజు ఎన్ని జవాబుపత్రాలు దిద్దారనే స్పష్టత ఉంటుందన్నారు. బాసర RGUKTలో ఆన్ స్ర్కీన్ మూల్యాంకనం విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఒక కంప్యూటర్ ఇవ్వడం జరుగుతుందని..స్కాన్ చేసిన జవాబుపత్రాలు అందులో కనిపిస్తాయన్నారు. వీటికి మార్కులు వేసుకుంటూ పోతే..సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొత్తం మార్కులను అదే లెక్క పెడుతుందన్నారు.