TS TET 2025: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన సర్కార్ .. ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

TS TET 2025: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన సర్కార్ .. ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే

Telangana government releases TET exam schedule

Updated On : June 4, 2025 / 6:02 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం రెండు షిఫ్ట్ లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ – 1, పేపర్ – 2 గా జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఎగ్జామ్ డేట్స్, సబ్జెక్టులు కేటాయించింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్ జరగనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 :30 వరకు రెండో షిఫ్ట్ జరుగనుంది.

5 వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 1లో, ఆరో తరగతి ఆపై తరగతులకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 2 కింద ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో జరగనుండగా, కొన్ని సబ్జెక్టులకు మాత్రం హిందీ, తమిళం, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, సంస్కృతం మాధ్యమాల్లో కూడా ఉండనున్నాయి పేపర్ 2 విభాగంలోని మ్యాథ్స్, సైన్స్ ఎగ్జామ్ తో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మొత్తం 16 సెషన్లలో జరగనున్నాయి. జూన్ 30న మైనారిటీ భాషల్లో జరిగే పరీక్షలతో ముగియనున్నాయి.

ఇక ఈ పరీక్షల కోసం జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, నల్గొండ, సిరిసిల్ల, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది ప్రభుత్వం. త్వరలోనే హాల్ టికెట్స్ కూడా విడుదల చేస్తామని, అఫీషియల్ వెబ్ సైటులో డౌన్లోడ్ చేసుకోవచ్చని, షెడ్యూల్ కి అనుగుణంగా తేదీలు గమనించి అభ్యర్థులు ఎగ్జామ్స్ కి హాజరుకావాలని తెలిపింది.