తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు 10tv.inలో చెక్ చేసుకోండి..
ఫలితాలను 10tv.inతో పాటు www.tgbie.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు మంగళవారం రిలీజ్ కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ఆఫీసు నుంచి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను రిలీజ్ చేస్తారు. రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను 10tv.inతో పాటు www.tgbie.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.
10tv.inలో ఇలా చెక్ చేసుకోండి
- 10tv.in/telangana-intermediate-results-2025 ఓపెన్ చేయండి
- ఓ పేజీ ఓపెన్ అవుతుంది
- ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ ఎంటర్ చేయండి
- ఫలితాలు వస్తాయి.. ప్రింట్ తీసుకోండి
అధికారిక వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేసుకోండి
- tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
- ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ ఎంటర్ చేయండి
- ఫలితాలు వస్తాయి.. ప్రింట్ తీసుకోండి