ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం…..వారంతా పాస్

  • Published By: murthy ,Published On : November 3, 2020 / 05:10 PM IST
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం…..వారంతా పాస్

Updated On : November 3, 2020 / 5:28 PM IST

Inter Board : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియేట్ బోర్డ్ పరీక్షల్లో పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది.

వీరిలో పరీక్షలకు హాజరు కాని వారు 27,251 మంది ఉండగా…. మాల్ ప్రాక్టీస్ స్క్రూటినీ కమిటీ బహిష్కరించిన వారు 338మంది ఉన్నారు. కోవిడ్ 19 ప్రత్యేక పరిస్ధితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.