తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 07:23 AM IST
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

Updated On : May 6, 2019 / 7:23 AM IST

తెలంగాణ 10వ తరగతి ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితాల వెల్లడిలో ఆలస్యమైనా ఎటువంటి తప్పులు లేకుండా ఫలితాలను పూర్తిస్తాయిలో విడుదల చేసేందుకే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని, పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇంటర్ ఫలితాలు ఇబ్బందులు చూసిన తరుణంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా పాఠశాల హెడ్‌మాస్టర్లకు కూడా ఫలితాలను పంపనున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే మే మూడోవారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి రోజున ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ అందరూ వారివారి పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది. 
 
ఫలితాలు ప్రకటించిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థి పేరు, గ్రేడ్‌ ఏంటి? సబ్జెక్టుల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచుతారు. ప్రతి విద్యార్థికీ వచ్చిన మార్కులు, గ్రేడ్‌లు ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్నాకే ఫలితాలు ప్రకటించనున్నారు.

ప్రతి విద్యార్థి గ్రేడ్‌ ఒకటికి రెండుసార్లు చెక్‌చేసి ఫలితాలు విడుదల చేస్తామని సున్నా వచ్చిన సబ్జెక్ట్‌ కు రీచెక్‌ చేసిన తర్వాత ఫైనల్‌ చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని. ఆలస్యం అయినా పక్కాగా పది ఫలితాలు విడుదల చేస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు.