TS Intermediate : జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Inter Advanced Supplementary
Inter Advanced Supplementary Exams : మే9వ తేదీన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించింది.
టైమ్ టేబుల్ విడుదల
ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
ఫస్టియర్ పరీక్షలు
జూన్ 12(సోమవారం) – లాంగ్వేజ్ పేపర్-1, జూన్ 13(మంగళవారం) – ఇంగ్లీష్, జూన్ 14(బుధవారం)- మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, జూన్ 15(గురువారం)- మ్యాథ్స్-1బీ, జువాలజీ, హిస్టరీ, జూన్ 16(శుక్రవారం)- ఫిజిక్స్, ఎకానమిక్స్, జూన్ 17(శనివారం)- కెమిస్ట్రీ, కామర్స్, జూన్(సోమవారం)- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్ (బైపీసీ స్టూడెంట్స్ కోసం), జూన్ 20(మంగళవారం)- మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు జరుగనున్నాయి.
సెకండియర్ పరీక్షలు
జూన్ 12(సోమవారం)- లాంగ్వేజ్ పేపర్-2, జూన్ 13(మంగళవారం)- ఇంగ్లీష్-2, జూన్ 14(బుధవారం)- మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, జూన్ 15(గురువారం)- మ్యాథ్స్-2బీ, జువాలజీ, హిస్టరీ, జూన్ 16(శుక్రవారం)-ఫిజిక్స్, ఎకానమిక్స్, జూన్ 17(శనివారం)- కెమిస్టీ, కామర్స్, జూన్ 19(సోమవారం)- పబ్లిక్ అడ్మిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ స్టూడెంట్స్ కోసం), జూన్ 20(మంగళవారం)- మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.