TS TET 2025: తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల చేశారు. విద్యాశాఖ వెబ్ సైట్, టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది

TS TET 2025
తెలంగాణ టెట్ – 2025 హాల్ టికెట్లు విడుదల చేశారు. విద్యాశాఖ వెబ్ సైట్, టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ టెట్ – 2025 పరీక్షలు జూన్ 18వ నుంచి జూన్ 30వ జరుగనున్నాయి.
హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్:
ముందుగా అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలో ‘Hall Ticket Download’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
తరువాత స్క్రీన్ పై మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
డౌన్లోడ్ అనే ఆప్షన్ పై చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
తెలంగాణ టెట్ – 2025 ముఖ్యమైన వివరాలు:
జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్ మరియు సైన్స్ పరీక్షలు జరుగుతాయి.
జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు, జూన్ 24 న పేపర్ 2, పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి.
జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్, జూన్ 28 నుంచి 30 వరకు పేపర్ 2 ఎగ్జామ్స్, అదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) పరీక్ష ఉంటుంది.
ఆ తరువాత ప్రాథమిక కీ విడుదల చేసి వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూలై 22న టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.