TSPSC Special : 2 వేల 528 పోస్టుల ఫలితాలు

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 03:30 AM IST
TSPSC Special : 2 వేల 528 పోస్టుల ఫలితాలు

హైదరాబాద్ : ఒక్కరోజే టీఎస్పీఎస్సీ పెద్ద ఎత్తున్న ఫలితాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం 2 వేల 528 పోస్టుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, టీచర్ రిక్రూట్ మెంట్ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాటితో కమిషన్ ఇప్పటి వరకు 20 వేల 600 కొలువులను భర్తీ చేసినట్లైంది. 

1823 ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, టీఆర్టీలో భాగంగా 653 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం), గురుకులాలకు చెందిన 52 టీజీటీ సైన్స్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఫారెస్టు బీట్ ఆఫీసర్ల కొలువులకు 2017 అక్టోబర్‌లో రాత పరీక్షలు, ఆ తర్వాత శారీరదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. 33 ఖాళీల ఫలితాలను విత్ హల్డ్‌లో ఉంచగా, మరో ఖాళీని సాంకేతిక కారణాల వల్ల భర్త చేయడం లేదు. టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టులో భాగంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) 699 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

653 మందిని ఎంపిక చేశారు. 25 మంది దివ్యాంగుల అభ్యర్థుల ఫలితాలను వైద్య ధృవీకరణ పత్రాలు అందిన తరువాత విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 22 ఖాళీలు ఏజెన్సీ ధృవపత్రాలు, వివిధ కోర్టుల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాలతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 36 వేల కొలువుల భర్తీకి 101 నోటిఫికేషన్లు విడుద చేసింది. త్వరలోనే మరిన్ని కొలువులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు భావిస్తున్నారు.