IBPS RRB Recruitment : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ ధరఖాస్తుకు ముగియనున్న గడువు !

ఈ పోస్టులకు దరఖాస్తు గడువు జూన్ 21 తో ముగియగా గడువుతేదిని జూన్ 28 వరకు పొడిగించారు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వంటివి ఆయా పోస్టులను భట్టి నిర్వహిస్తారు.

IBPS RRB Recruitment : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ ధరఖాస్తుకు ముగియనున్న గడువు !

IBPS RRB Recruitment

Updated On : June 29, 2023 / 10:15 AM IST

IBPS RRB Recruitment : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశ వ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8,000 గ్రూప్ A , గ్రూప్ B పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. IBPS RRB ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 1 జూన్ 2023 నుండి ప్రారంభం కాగా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 28 జూన్ 2023 తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా PO, క్లర్క్, ఆఫీసర్ స్కేల్ II, III, మొదలైన పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Rakesh Master : రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేసిన మామయ్య.. నాకు ఆస్తులు అవసర్లేదు, అభిమానం చాలు..

వాస్తవానికి, ఈ పోస్టులకు దరఖాస్తు గడువు జూన్ 21 తో ముగియగా గడువుతేదిని జూన్ 28 వరకు పొడిగించారు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వంటివి ఆయా పోస్టులను భట్టి నిర్వహిస్తారు. IBPS జూలై 17 మరియు 22 మధ్య అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ శిక్షణను నిర్వహిస్తుంది. RRB PO మరియు RRB క్లర్క్ కోసం ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో నిర్వహించబడుతుంది మరియు వివరణాత్మక షెడ్యూల్ తర్వాత విడుదల చేయబడుతుంది. మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది.

READ ALSO : Titan Sub Derbis Found: టైటాన్ శిథిలాల నుండి బిలియనీర్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్న యూఎస్ కోస్ట్ గార్డ్

ఈ ఖాళీల కోసం ఇంటర్వ్యూలు అక్టోబర్/నవంబర్‌లో నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుముగా SC, ST మరియు PwBD అభ్యర్థులకు ₹175 . మిగతా వారందరికీ, రుసుము ₹850గా నిర్ణయించారు. అభ్యర్ధుల వయస్సు ఆయా పోస్టులను భట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://ibps.in పరిశీలించగలరు.