TG EDCET: టీజీ ఎడ్సెట్ సెకండ్ ఫేజ్.. రిజిస్ట్రేషన్స్ కి రేపే లాస్ట్ డేట్.. స్పాట్ అడ్మిషన్స్ వివరాలు మీకోసం
తెలంగాణాలో బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీజీ ఎడ్ సెట్(TG EDCET) - 2025 కౌన్సెలింగ్ లో భాగంగా ఇప్పటికే

Tomorrow is the last date for TG Ed Set 2025 second phase registration.
TG EDCET: తెలంగాణాలో బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీజీ ఎడ్ సెట్ – 2025 కౌన్సెలింగ్ లో భాగంగా ఇప్పటికే మొదటీఫేజ్ పూర్తవగా ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 లోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్(TG EDCET) ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్ సైట్ నుండి https://edcetadm.tgche.ac.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Railway Jobs: రైల్వేలో జాబ్స్.. 865 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు, పూర్తి వివరాలు
ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు:
సెప్టెంబర్ 5 నుంచి 6: వెబ్ ఆప్షన్స్ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
సెప్టెంబర్ 7: వెబ్ ఒప్షన్స్ ఎడిటింగ్ అవకాశాన్ని కల్పిస్తారు.
సెప్టెంబర్ 11: సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
సెప్టెంబర్ 12 నుంచి 16: సీటు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి
ఇక ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 9 వేల మందికి సీట్లను కేటాయించారు అధికారులు. ఇక రెండవ ఫేజ్ కూడా పూర్తయిన తరువాత మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీ చేస్తారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.