UPSC పరీక్షా కేంద్రాలు మారుతున్నాయి.. అభ్యర్థులదే ఎంపిక!

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 05:14 PM IST
UPSC పరీక్షా కేంద్రాలు మారుతున్నాయి.. అభ్యర్థులదే ఎంపిక!

Updated On : July 1, 2020 / 5:52 PM IST

యూపీఎస్‌సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల మార్పునకు అనుమతి లభించింది. యూపీఎస్‌సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్‌ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 4న జరుగుతాయని UPSC వెల్లడించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి అభ్యర్థన మేరకు యూపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

పెద్దసంఖ్యలో అభ్యర్ధులు సివిల్స్‌ ప్రిలిమనరీ, ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతున్నారు. దీంతో పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు యూపీఎస్‌సీ తెలిపింది. అదనపు అభ్యర్ధులకు ఆయా కేంద్రాలు వసతుల పెంపు ఆధారంగా అభ్యర్ధుల పరీక్షా కేంద్రాల మార్పు అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7 నుంచి 13 వరకూ జులై 20 నుంచి 24 వరకూ రెండు దశల్లో కమిషన్‌ వెబ్‌సైట్‌ https://upsconline.nic.in ద్వారా అందించాలని కోరింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ను సందర్శించి పరీక్షా కేంద్రాలపై తమ ఎంపికను సమర్పించాలని కోరింది. అభ్యర్ధుల వినతులను ‘First Apply First Allot’ ఫస్ట్‌ అప్లై-ఫస్ట్‌ అలాట్‌’ పద్ధతిన పరిశీలిస్తామని తెలిపింది. సీలింగ్‌ కారణంగా తాము కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.

Read:ఆన్ లైన్ డిగ్రీ కోర్సు ప్రారంభించిన మద్రాస్ IIT