UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 14,624 మంది అర్హత..

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు సెప్టెంబర్ 15న మెయిన్స్ రాయొచ్చు.

UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 14,624 మంది అర్హత..

UPSC

Updated On : June 12, 2023 / 4:01 PM IST

UPSC – Prelims Result 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది మేలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (Civil Services) ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 14,624 మంది అర్హతసాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఫలితాలపై సందేహాల నివృత్తికి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 011-23385271, 011-23098543 లేదా 011-23381125 నంబర్ల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు సెప్టెంబర్ 15న మెయిన్స్ రాయొచ్చు. 1,105 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లోనూ అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. upsc.gov.in లో అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.

ఆ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే Written Result – Civil Services (Preliminary) Examination, 2023 అలాగే, Written Result (with name)- Civil Services (Preliminary) Examination, 2023 లింకులు కనపడతాయి. వాటిపై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

అర్హత సాధించిన 14,624 మంది పేర్ల కోసం క్లిక్ చేయండి

UGC NET : జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు