NLC Recruitment : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

అభ్యర్థులను సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in పరిశీలించగలరు.

NLC Recruitment : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

NLC Recruitment

Updated On : April 27, 2023 / 6:50 PM IST

NLC Recruitment : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 అప్రెంటిస్‌, టెక్నిషియన్‌, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ 35, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ 42, ఐటీఐ అప్రెంటిస్ 86 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్, టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంబీఏ (హెచ్ఆర్) ,ఎంఎస్‌డబ్ల్యూ,పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

అలాగే టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ డిప్లొమా పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్‌,టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్, టెక్నాలజీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు