Global Education Prize : గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రైజ్ టాప్ 10 తుదిజాబితాలో పశ్చిమ బెంగాల్ టీచర్

పేద కుటుంబాలలో నిరక్షరాస్యత తొలగించాలన్న ఏకైక లక్ష్యంతో , భవిష్యత్తు తరాలవారికి మంచి అవకాశాలను అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు.

Global Education Prize : గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రైజ్ టాప్ 10 తుదిజాబితాలో పశ్చిమ బెంగాల్ టీచర్

Global Education Prize

Global Education Prize : పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసన్సోల్‌కు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడు గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 టాప్ 10 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ అసాధారణమైన అధ్యాపకులను గుర్తించి, ఈ రంగంలో వారి అత్యుత్తమ సహకారానికి $1 మిలియన్ డాలర్ల అవార్డును అందజేస్తుంది.ఈ ఎంపిక ప్రక్రియలో 130 దేశాల నుండి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో, మారుమూల ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వెనుకబడిన పిల్లలను ప్రభావితం చేసే విధంగా దీప్ నారాయణ్ నాయక్ అనే ఉపాధ్యాయుడు ఆరుబయట విద్యభోధన చేపట్టారు.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

దీప్ నారాయణ్ నాయక్ యొక్క వినూత్న బోధనా పద్ధతులు, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేద పిల్లలనే ఎంచుకుని మారుమూల ప్రాంతంలో చేపట్టిన భోధనా ప్రక్రియ సర్వత్రా ప్రశంసలు అందుకుంది. డిజిటల్ భోధన ప్రక్రియకు కనీసం నోచుకోలేని ఆ పేద విద్యార్ధులకు సామాజిక దూరం పాటిస్తూనే దీప్ నారాయణ్ నాయక్ విద్యాభోధన చేస్తారు.

READ ALSO : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే లాభాలు

వీధుల్లో విద్యాభోధన చేసే ఉపాధ్యాయుడుగా ప్రసిద్ధి చెందిన నాయక్ అసన్సోల్‌లోని జమురియాలోని తిల్కా మాంఝీ ఆదివాసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మట్టి గోడలను బ్లాక్‌బోర్డ్‌లుగా మార్చటంతోపాటుగా, రోడ్లనే తరగతి గదులుగా , విద్యార్ధులు కరోనా బారిన పడకుండా సామాజిక దూరం పాటించే విధంగా విద్యాభోదన సాగించారు. రాత్రి సమయంలో దీపాల వెలుతురులో నిరుపేద చిన్నారులకు చదువు చెప్పేవారు.

READ ALSO : Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

పేద కుటుంబాలలో నిరక్షరాస్యత తొలగించాలన్న ఏకైక లక్ష్యంతో , భవిష్యత్తు తరాలవారికి మంచి అవకాశాలను అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన బోధనా పద్ధతులు అక్షరాస్యతను పెంచడమే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకు, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడ్డాయి.

READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు

అంతేకాకుండా పేద కుటుంబాలలో పోషకాహార లోపం, దోపిడీ ,బాల్య వివాహాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి కార్యక్రమాలను నిర్వహించారు. నాయక్ రూపకల్పన చేసిన త్రీ-డైమెన్షనల్ మోడల్ విద్యా భోధన, ఉపాధి అవకాశాలను సృష్టించింది. పర్యావరణంపై అవగాహన కల్పించే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు నాయక్. టీచర్ ఎట్ యువర్ డోర్‌స్టెప్’ కార్యక్రమం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మంచి మార్గనిర్దేశంగా దోహదపడింది. విద్యార్ధులు స్కూలుకు గైర్హాజరు కావటాన్ని తగ్గించడం, పాఠశాలకు రాకుండా మానేయటం వంటి వాటిని అరికట్టడం వంటి వాటిని లక్ష్యంగా చర్యలు చేపట్టారు.