NASA: నాసాలో చేరాలంటే ఏం చేయాలి? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? పూర్తి వివరాలు

NASA: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు నాసాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే స్థాయిలో సంస్థ కూడా అవకాశాలు అందిస్తోంది.

NASA: నాసాలో చేరాలంటే ఏం చేయాలి? ఎలాంటి అవకాశాలు ఉంటాయి? పూర్తి వివరాలు

Career options in NASA

Updated On : June 25, 2025 / 2:54 PM IST

నాసా (NASA – National Aeronautics and Space Administration) ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది అమెరికాలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు నాసాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే స్థాయిలో సంస్థ కూడా అవకాశాలు అందిస్తోంది. కానీ, అది అంత సులభమైన పని కాదు. ఎంతో కష్టం, సాధించాలన్నా తపన, కఠోర దీక్ష ఉంటే తప్పా నాసాలో అవకాశం దక్కించుకోలేం. ఇప్పటికే భారతదేశం నుంచీ కూడా చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు నాసాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా చాలా మంది అక్కడ పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరి అలాంటి నాసా సంస్థలో చేరాలంటే ఎం చేయాలి? ఎలాంటి నైపుణ్యం, ప్రతిభ ఉండాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నాసాలో ఏ ఏ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి:

  • ఇంజినీరింగ్ (ఏరో స్పేస్, మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్ వేర్)
  • శాస్త్రవేత్తలు (ఆస్ట్రోఫిసిక్స్, జియాలజి, ప్లానెటరీ సైన్స్)
  • ఆస్ట్రోనాట్లు
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ / డేటా సైంటిస్టులు
  • పబ్లిక్ పాలసీ, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ విభాగాలు

విద్యార్హతలు (Educational Requirements): 

ప్రాథమిక విద్య, 10th, Inter / 12th లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి.

డిగ్రీలో సంబంధిత విభాగంలో బీటెక్ (B.Tech) / బీఎస్సీ (B.Sc) పూర్తి చేయాలి.

  • ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (Aerospace Engineering)
  • మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical Engineering)
  • కంప్యూటర్ సైన్స్ (Computer Science)
  • ఫిజిక్స్, మ్యాథ్స్ (Physics, Mathematics)

పీజీ / పీహెచ్.డి చాలా అవసరం. నాసాలో చాలా ఉద్యోగాలకూ మాస్టర్స్ లేదా డాక్టరేట్ (Ph.D.) అవసరం. ఇది అభ్యర్థి సంశోధన పట్ల మక్కువను చూపిస్తుంది.

భారతదేశం నుంచి నాసాలో చేరాలంటే మార్గాలు:

ఉన్నత విద్య ద్వారా : అమెరికాలో ఉన్న మంచి యూనివర్శిటీలలో MS / PhD చేయడం ద్వారా నాసాలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. MIT, Stanford, Caltech, University of Michigan లాంటి టాప్ కాలేజీల్లో చదవడం వల్ల నాసా ద్వారా ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్స్ చేసే అవకాశం లభిస్తుంది.

ఇంటర్న్‌షిప్ / ఫెలోషిప్ ద్వారా: NASA జత కలిసే కొన్ని ప్రోగ్రామ్స్ లో ఇంటర్న్ షిప్ చేయడం వల్ల జాబ్ అవకాశం పొందవచ్చు.

  • NASA International Internship Program (NASA I²)
  • JPL Visiting Student Researcher Program (JVSRP)
  • ISRO – NASA Research Collaborations

నాసా ఉద్యోగ దరఖాస్తు: డైరెక్ట్ గా కూడా నాసాలో కొన్ని ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ, వీటి కోసం US Citizenship అవసరం ఉంటుంది.

కావలసిన నైపుణ్యాలు:

  • Strong Academic Background
  • Research Publications / Projects
  • Problem Solving & Creativity
  • Coding (Python, MATLAB, C++, etc.)
  • Communication & Teamwork
  • Passion for Space and Innovation

ఇవి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి: 

  • పాఠశాల స్థాయిలో సైన్స్, మ్యాథ్స్ మీద పట్టు
  • ఇంజినీరింగ్ / సైన్స్ లో మంచి ర్యాంకుతో గ్రాడ్యుయేషన్
  • విదేశాల్లో ఉన్నత విద్య (MS / Ph.D.)
  • రీసెర్చ్ పేపర్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్‌లు
  • NASA ఇంటర్న్‌షిప్ లేదా పాఠశాలల ద్వారా దరఖాస్తు
  • మెరుగు నైపుణ్యాల‌తో, పోటీతత్వ పరీక్షలు/ఇంటర్వ్యూలు క్రాస్ చేయాలి.