Assembly Elections 2023: అమిత్ షాకు తప్పిన ప్రమాదం.. కరెంటు తీగలకు తగిలిన ప్రచార రథం

ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అజ్మీర్ డివిజనల్ కమిషనర్‌ను హోం శాఖ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం రాత్రి స్వయంగా చెప్పారు

Assembly Elections 2023: అమిత్ షాకు తప్పిన ప్రమాదం.. కరెంటు తీగలకు తగిలిన ప్రచార రథం

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షాకు కొద్దిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాజస్థాన్‌లో పర్బత్‌సర్‌లో అమిత్ షా ‘ప్రచార రథం’ (ప్రత్యేకంగా రూపొందించిన వాహనం) పై భాగం విద్యుత్ వైరుతో తాకింది. ఈ వెంటనే ఒక్కసారిగా ఒక స్పార్క్ వచ్చింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. మంత్రితో సహా అందరూ సురక్షితంగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అజ్మీర్ డివిజనల్ కమిషనర్‌ను హోం శాఖ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం రాత్రి స్వయంగా చెప్పారు. షా కాన్వాయ్ బిడియాద్ గ్రామం నుంచి పర్బత్‌సర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయన కాన్వాయ్ ఒక వీధి గుండా వెళుతుండగా, రథం పై భాగం తీగను తాకినప్పుడు ఒక స్పార్క్ ఏర్పడింది.

రథానికి తాకిన కరెంట్ తీగ స్పార్క్ వల్ల తెగిపోయి రోడ్డుపై పడింది. ఆ వెంటనే నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరిగ్గా అప్పుడే రథం వెనుక మిగిలిన వాహనాలు నిలిచిపోయాయి. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం అమిత్ షా మరో వాహనంలో పర్బత్సర్ చేరుకున్నారు.