2024 Elections: అఖిలేష్‭తో వర్కౌట్ అయ్యేలా లేదు. ప్లాన్-బీ రెడీ చేసుకున్న కాంగ్రెస్

దేశవ్యాప్తంగా చాలా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు

2024 Elections: అఖిలేష్‭తో వర్కౌట్ అయ్యేలా లేదు. ప్లాన్-బీ రెడీ చేసుకున్న కాంగ్రెస్

Updated On : November 4, 2023 / 9:15 PM IST

Clash Between Congress and SP: కాంగ్రెస్ పార్టీని ‘మోసగాళ్లు’ అంటూ సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం అంత సీరియస్ గా సమాధానం ఇవ్వడం లేదు. అఖిలేష్ తీరుతో కాంగ్రెస్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అఖిలేష్ లేకుండా ప్లాన్-బీకి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

బీఎస్పీపై కన్నేసిన కాంగ్రెస్ వ్యూహకర్తలు
వాస్తవానికి కాంగ్రెస్ వ్యూహకర్తలు నిరంతరం బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు అవకాశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. నిజానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత మాయావతి స్పష్టం చేసినప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా.. దానిని కాంగ్రెస్ తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీతో పోటీ పడాలంటే ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కాంగ్రెస్‌కు అవసరం కాబట్టి ఎస్పీ కుదరకపోతే బీఎస్పీనే తమ ఆప్షన్ అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు శాపనార్థాలు
దేశవ్యాప్తంగా చాలా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తమ ప్రయోజనాల గురించి భయపడే ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక విషయంలో కాంగ్రెస్‌ను తిట్టుకుంటూనే ఉన్నాయి.

కాంగ్రెస్‌కు బీఎస్పీ మంచి ఆప్షన్
65 స్థానాల్లో తాము పోటీ చేస్తామని అఖిలేష్ అల్టిమేటం ఇచ్చారు. అయితే ఇన్ని సీట్ల విషయంలో హైకమాండ్ రాజీపడదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు వారికి బీఎస్పీ బెటర్ ఆప్షన్. దానికి కారణం దళితుల ఓట్లు ఉండడం. పైగా కాంగ్రెస్ ను ముస్లింలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్-బీఎస్పీ కలిస్తే అగ్రవర్ణాల వారు కూడా ఇటువైపు బాగానే చూడొచ్చు. సాధారణంగా ఎస్పీకి దూరంగా ఉండే దళితులు, అగ్రవర్ణాలు కూడా కాంగ్రెస్ పాత ఓటు బ్యాంకుగా ఉన్నారు.