Assembly Elections 2023: హర్యానాలో బీజేపీతో జేజేపీ పొత్తు తెగినట్టేనా? రాజస్థాన్ ఎన్నికలపై దుశ్యంత్ ఏమన్నారు?
భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల భద్రత, హర్యానా వంటి ఉపాధి, పేపర్ లీక్, మైనింగ్ మాఫియా, గ్యాంగ్ వార్ వంటి అంశాలను ఈ ఎన్నికల్లో జేజేపీ ప్రాధాన్యంగా తీసుకుందని అన్నారు

Assembly Elections 2023: హర్యానాలో జన్ నాయక్ జనతా పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే నాలుగేళ్ల అనంతరం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు తెగిపోనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కారణం.. తాజాగా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జననాయక్ జనతా పార్టీ సిద్ధమైంది. భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరదించారు. రాజస్థాన్‌లో 25 నుంచి 30 స్థానాలకు జేజేపీ సిద్ధమవుతుందని, జేజేపీ కీతో రాజస్థాన్ అసెంబ్లీ తాళం తెరవబడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: CM vs Governor: సీఎం, గవర్నర్ గొడవతో వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు
భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల భద్రత, హర్యానా వంటి ఉపాధి, పేపర్ లీక్, మైనింగ్ మాఫియా, గ్యాంగ్ వార్ వంటి అంశాలను ఈ ఎన్నికల్లో జేజేపీ ప్రాధాన్యంగా తీసుకుందని అన్నారు. హర్యానా తరహాలో పంట నష్టపరిహారం, వృద్ధాప్య పింఛను పథకాలను ప్రోత్సహించడం తమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.