KCR at Cherial: 50 ఏళ్ల కాంగ్రెస్‌.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పనితీరులో తేడా చూడాలి: కేసీఆర్

జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఈ సభ నిర్వహించారు. అయితే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది

KCR at Cherial: 50 ఏళ్ల కాంగ్రెస్‌.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పనితీరులో తేడా చూడాలి: కేసీఆర్

తమ 10 ఏళ్ల పాలనను కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనతో పోల్చి చూడాలని, ఈ రెండింటిలో తేడాను గమనించాలని ఓటర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. 50 ఏళ్ల కాంగ్రెస్‌.. పదేళ్ల BRS పనితీరులో తేడా గమనించి నిర్ణయం తీసుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ణప్తి చేశారు.

జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఈ సభ నిర్వహించారు. అయితే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. దీనికి విపక్ష పార్టీలన్నీ ఈపాటికే మద్దతు ప్రకటించాయి. అధికార పార్టీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించడం గమనార్హం. కాగా, ఇంతకు ముందు జనగామలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు.