Assembly Elections 2023: కాంగ్రెస్ విషయంలో సర్వేలు పని చేయలేదు.. హైకమాండ్ పంపిన కమిటీ కూడా అట్టర్ ప్లాప్

పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

Assembly Elections 2023: కాంగ్రెస్ విషయంలో సర్వేలు పని చేయలేదు.. హైకమాండ్ పంపిన కమిటీ కూడా అట్టర్ ప్లాప్

Updated On : October 23, 2023 / 6:37 PM IST

Rajasthan Politics: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తలా రెండు అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. మొత్తం రెండు వందల సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 124 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 76 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులను పరిశీలిస్తే.. ఏడాది క్రితం హైకమాండ్‌ నిర్ణయించిన మార్గదర్శకాల వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. సర్వే చేసినా ప్రయోజనం లేకపోయింది. పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘించి వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమైన ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను పార్టీ నామినేట్ చేసింది. అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులకు టిక్కెట్లు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: CJI Chandrachud: అమలు చేసేవారు సరిగా ఉంటే చెడు రాజ్యాంగం కూడా బాగుంటుంది.. అమెరికా మీటింగులో అంబేద్కర్ మాటల్ని ప్రస్తావించిన సీజేఐ

హైకమాండ్ చేసిన సర్వేలో పరిస్థితి విషమంగా ఉన్న 17 మంది ఎమ్మెల్యేలను పార్టీ మళ్లీ రంగంలోకి దించింది. హైకమాండ్ పంపిన పరిశీలకుల నివేదిక కూడా కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించడంలో సహాయపడలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కలిసి తమ తమ మద్దతుదారులకు టిక్కెట్లు పంపిణీ చేశారు. పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

ఉదయపూర్ చింతన్ శివిర్‌తో సహా వివిధ సమావేశాల్లో కాంగ్రెస్ మార్గదర్శకాలను నిర్ణయించింది. ఇందులో భాగంగా వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదు. కానీ ఇద్దరికి టిక్కెట్లు ఇచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన రెబల్స్‌కు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కానీ గెహ్లాట్ ఒత్తిడితో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు మహిళలకు 13 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 33 శాతం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: కాంగ్రెస్ అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారు? పెద్ద విషయమే వెల్లడించిన దిగ్విజయ్ సింగ్