“ఇంప్రెస్ అయ్యాను” అంటూ 10టీవీపై మంత్రి ఉత్తమ్ ప్రశంసల జల్లు.. డిఫెన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పెట్టుబడిదారులకు ఆహ్వానం
"సాధారణంగా టీవీ ఛానెళ్లు సెన్సేషన్ కోసం చూస్తుంటాయి. నేటి 10టీవీ కార్యక్రమంలో మాత్రం ఏమీ సెన్సేషన్ లేదు. 10టీవీ మరింత విశ్వసనీయతను, వ్యూయర్‌షిప్‌ను సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు.
Uttam Kumar Reddy
- నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థిని
- 10TV బియాండ్ బోర్డర్స్ ప్రోగ్రాం అభినందనీయం
- 10టీవీకి మరింత విశ్వసనీయతను సాధిస్తుంది
10TV Beyond Borders: 10TV బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ, అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్న సంస్థలను సమున్నతంగా గౌరవించడమే మా ఈ 10TV Beyond Borders Coffee Table Book మహోన్నత ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమానికి నన్నెందుకు ఆహ్వానించారోనని చాలా మంది అనుకుంటుండొచ్చు. నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థిని. నాకు మిలటరీ బాక్‌గ్రౌండ్ ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను.
శ్రీధర్ బాబు నేతృత్వంలో హైదరాబాద్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్‌లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్‌లో ఈ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాల సహకారం అందిస్తాం. డిఫెన్స్, ఎరోస్పేస్‌లో పెట్టుబడులకు ముందుకు వస్తే నేను, శ్రీధర్‌బాబు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ సహకరిస్తాం. డీఆర్‌డీవో ఎంతగానో పురోగతి సాధించింది.
హైదరాబాద్‌లో 10టీవీ ఈ సబ్జెక్ట్‌పై ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సాధారణంగా టీవీ ఛానెళ్లు సెన్సేషన్ కోసం చూస్తుంటాయి. నేటి కార్యక్రమంలో మాత్రం ఏమీ సెన్సేషన్ లేదు. 10టీవీ మరింత విశ్వసనీయతను, వ్యూయర్‌షిప్‌ను సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు.
10TV Beyond Borders Coffee Table Book బుక్ pdf ఓపెన్ చేయండి..
