Maha Kumbh Mela 2025: యావత్ దునియా దృష్టిని అ్రటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది యూపీ సర్కార్..!
Prayagraj Maha Kumbh Mela 2025: 45 రోజుల పాటు జరగబోతున్న హిందుత్వ వేడుకకు ..హైటెక్ టెక్నాలజీతో..ఓ రేంజ్లో అరేంజ్మెంట్స్ చేస్తోంది యోగి సర్కార్. కొత్త ఏడాదిలో జరగబోయే ఈ మెగా ఈవెంట్‌ను..చరిత్రలో నిలిచి పోయేలా..ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రభుత్వం.
మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఇప్పటికే సాధువులు, సంతులు, స్వామిజీలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. శ్రీ పంచ దశనామ్ ఆవాహన్ అఖాడ సాధువులు హరిద్వార్ నుంచి పవిత్ర కర్రను ప్రయాగరాజ్‌కు తీసుకొచ్చారు.
ప్రయాగరాజ్ మహాకుంభ్‌లో పవిత్ర స్నానం ఆచరించడానికి వస్తున్న కోట్లాది మంది భక్తులు సనాతన ధర్మజ్యోతిని వెలిగించే పవిత్ర కర్రను దర్శనం చేసుకుంటారు. శ్రీ పంచ దశనామ్ ఆవాహన్ అఖాడకు చెందిన వందలాది మంది మహాత్ములు..ఈ పవిత్ర కర్ర యాత్రలో పాల్గొన్నారు.