Former Minister Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన అధికారులు
మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. మల్లారెడ్డి కళాశాలకోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లిలో 2500 గజాల స్థలాన్ని ఆక్రమించారంటూ ఆరోపణలు రావడంతో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మేడ్చల్ కలెక్టర్ అక్రమ కట్టడాలను తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు.