Weight Loss Tips: వర్క్అవుట్ ముందు తరువాత ఈ ఫుడ్ తీసుకోండి.. తొందరగా బరువు తగ్గుతారు.. ట్రై చేయండి
Weight Loss Tips: వ్యాయాయం ముందు ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఓట్స్‌లో ఫైబర్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

6 foods to eat before and after a workout for faster weight loss
శరీర బరువు తగ్గించుకోవాలంటే కేవలం వర్క్‌అవుట్ చేస్తే సరిపోదు. దానితో పాటు సరైన ఆహరం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్క్‌అవుట్ ముందు/తరువాత తీసుకునే ఆహారం శరీరానికి మేలుచేయాలి, ఫ్యాట్ బర్న్ చేసే విధంగా ఉండాలి. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమతుల్యంగా అందేలా ఆ ఆహారం ఉండాలి. అలాంటి ఆరు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వర్క్‌అవుట్ ముందు (Pre-Workout) తీసుకోవాల్సిన 3 రకాల ఫుడ్:
1.ఓట్స్, ఓట్స్ ఉప్మా (Oats / Oats Upma):
వ్యాయాయం ముందు ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఓట్స్‌లో ఫైబర్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి వర్క్‌అవుట్ సమయంలో శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఓట్స్‌తో చేసిన హెల్తీ ఉప్మా తినడం కూడా మెరుగైన శక్తిని అందిస్తుంది.
2.బనానా/అరటిపండు (Banana):
బనానా/అరటిపండులో సహజమైన చక్కెరలు, పొటాషియం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది, వెంటనే శక్తిని అందిస్తుంది. చిన్న వర్క్‌అవుట్‌కి ముందు ఒక బనానా తీసుకోవడం మంచిది.
3.బ్లాక్ కాఫీ (Black Coffee):
వర్క్‌అవుట్ చేయడానికి 30 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తీసుకుంటే మెటబాలిజం వేగంగా పని చేస్తుంది. బ్లాక్ కాఫీలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫ్యాట్ బర్నింగ్‌ను ఉత్సాహపరుస్తుంది. అయితే, ఇందులో చక్కెర, పాలును కలపకుండా తీసుకోవడం మంచిది.
వర్క్‌అవుట్ తరువాత (Post-Workout) తీసుకోవాల్సిన 3 రకాల ఫుడ్:
1.గ్రీకు యోగర్ట్ + బెర్రీలు (Greek Yogurt with Berries):
శరీరానికి ప్రోటీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా కావాలంటే గ్రీకు యోగర్ట్, బెర్రీ బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వర్క్‌అవుట్ తరువాత కండరాలు బలహీనంగా ఉంటాయి. ఆ సమయంలో గ్రీకు యోగర్ట్ + బెర్రీలలో తీసుకోవడం వల్ల కండరాల పునరుద్ధరన జరుగుతుంది.
2.ఉడికించిన గుడ్డు తెల్లసొన + ఓలివ్ ఆయిల్‌తో తక్కువ మొత్తంలో శాకాహారములు:
గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వ్యాయాయం తరువాత ఇది తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే కొద్దిగా ఓలివ్ ఆయిల్‌లో వేపిన కూరగాయలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి, ఫైబర్ అందిస్తాయి. ఫైబర్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
3.నిమ్మరసం,తేనె కలిపిన నీరు (Lemon-Honey Water):
వర్క్‌అవుట్ చేయడం వల్ల చమట వస్తుంది. కాబట్టి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీన్ని నివారించడానికి నిమ్మ, తేనే రసం అనేది సరైన ద్రావణం. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, ఫ్యాట్‌ను వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.
వర్క్‌అవుట్‌కు ముందు శరీరానికి అవసరమైన ఎనర్జీని అందించటం, తరువాత అవసరమైన పోషకాలు ఇచ్చి కండరాలను పునరుద్ధరించటం చాలా అవసరం. పైగా, ఈ ఆహార పదార్థాలన్నీ తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తిని ఇవ్వగలవు. ఇవి రోజూ తీసుకుంటే, మెటబాలిజం వేగంగా పని చేసి బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.