7000 Steps Per Day: ప్రతిరోజు 7000 అడుగులు.. ఒక్క సమస్య కూడా ఉండదు.. మీరు కూడా ఇలా ట్రై చేయండి
7000 Steps Per Day: నడక వలన రక్తనాళాల్లో గాలి ప్రవాహం మెరుగవుతుంది. LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయి తగ్గి, HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయి పెరుగుతుంది.

Health benefits Walking benefits
ఆరోగ్యం కోసం చేసే వ్యాయామాల్లో నడక (walking) అనేది అత్యుత్తమమైనది. ఏ వయసు వారైనా చాలా సులభంగా చేయగలిగే వ్యాయామం. నిపుణులు కూడా నడక అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. అయితే నడకలో చాలా రకాలు ఉన్నాయి. అందులోను ముఖ్యంగా రోజూకు 7,000 అడుగుల నడక చేయడం వల్ల శరీరాన్ని అద్భుతమైన ఆరోగ్యం కలిగుతుందట. మరి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలిక వ్యాధులకు ఈ నడక ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1.గుండె ఆరోగ్యం మెరుగవుతుంది:
నడక వలన రక్తనాళాల్లో గాలి ప్రవాహం మెరుగవుతుంది. LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయి తగ్గి, HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయి పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం 20 నుంచి 30% వరకూ తగ్గుతుంది. రోజుకు 7000 అడుగులు నడిచే వారిలో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.
2.మానసిక ఆరోగ్యానికి మంచిది:
నడక వలన మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్లు (endorphins) విడుదల అవుతాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నడక వలన మెదడుకు ప్రశాంతంగా మారుతుంది.
3.బరువు తగ్గిస్తుంది:
రోజు 7,000 అడుగులు నడవడం ద్వారా సగటున 250 నుంచి 300 కేలరీలు ఖర్చవుతాయి. ఇది మెటాబాలిజం బాగా పనిచేయడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గే ప్రాసెస్‌ను వేగవంతం చేయాలంటే నడకను డైట్‌తో కలిపి చేయడం మంచిది.
4.టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది:
నడక వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో మితమైన వ్యాయామంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి రోజూ నడక తప్పనిసరి అనే చెప్పాలి.
5.ఎముకలు, జాయింట్లు బలపడతాయి:
నడక అనేది లైట్ వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజ్ గా పనిచేస్తుంది. ఇది ఎముకల్లోని డెన్సిటీ పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారిస్తుంది.
6.నిద్ర నాణ్యత మెరుగవుతుంది:
రోజూ నడక వల్ల నిద్ర సమస్యలు దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీర శ్రమ వల్ల నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
7.శరీరంలోని వాపు తగ్గుతుంది:
మెట్టదైన నడక వ్యాయామం వలన చర్మం, శరీర కణజాలాలలో వాపు తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాడీ ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
శాస్త్రీయ ఆధారాలు:
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయన ప్రకారం రోజుకు 7,000 అడుగులు నడిచే వ్యక్తులలో మరణ శాతం 50 నుంచి 70 శాతం తగ్గుతుంది. ప్రతి 2,000 అడుగులకు సుమారు 100 కేలరీలు ఖర్చవుతాయి, 7,000 అడుగులకు దాదాపు 300 కేలరీలు ఖర్చవుతాయి.
ఇవి కూడా అలవాటు చేసుకోండి:
- ఉదయం, సాయంత్రం నడకకు స్థిరమైన సమయం కేటాయించండి.
- ఫోన్ కాల్స్ మాట్లాడుతూ నడవండి.
- లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం మొదలుపెట్టండి.
- పార్క్ కి దూరంగా వాహనం పార్క్ చేసి నడవండి.
- ఫిట్‌నెస్ ట్రాకర్ లేదా మొబైల్ యాప్ ద్వారా అడుగులు లెక్కించండి.
ప్రతి రోజు 7,000 అడుగులు నడవడం వల్ల దీర్ఘకాలికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది హృదయం, మెదడు, ఎముకలు, చర్మం, మనసుకు టానిక్ లాంటి పని చేస్తుంది. వ్యాయామం చేయలేని వారికీ ఇది మొదటి మెట్టు. ఆరోగ్యాన్ని నడక ద్వారా గెలుచుకోవచ్చు!