నిద్రలేమి.. ‘మతిమరుపు’ కు సిగ్నల్!

మీరూ నిద్రలేమితో బాధపడుతున్నారా? అలా అయితే.. ఆల్జిమర్స్ (మతిమరుపు) వ్యాధిని మీ జీవితంలోకి ఆహ్వానించనట్టే. నిద్రలేమి ఎక్కువ అయితే.. అది అల్జిమర్స్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.

  • Published By: sreehari ,Published On : January 14, 2019 / 11:40 AM IST
నిద్రలేమి.. ‘మతిమరుపు’ కు సిగ్నల్!

మీరూ నిద్రలేమితో బాధపడుతున్నారా? అలా అయితే.. ఆల్జిమర్స్ (మతిమరుపు) వ్యాధిని మీ జీవితంలోకి ఆహ్వానించనట్టే. నిద్రలేమి ఎక్కువ అయితే.. అది అల్జిమర్స్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.

  • పగటి నిద్ర కంటే.. రాత్రి నిద్రే ఎంతో మేలట.. 

  • పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి..  

ప్రతిప్రాణికి నిద్ర ఎంతో అవసరం. కంటినిండా నిద్రపోతే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజుంతా ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు కానీ, ఒకరోజు నిద్రపోకుండా ఉండలేరు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో అవసరం. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు. ఎంతసేపు నిద్రపట్టింది.. ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. నిద్రలేమితో బాధపడేవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కంటినిండా నిద్రపోవాలి అంటారు. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు. ‘సరైన నిద్ర లేకుంటే.. లేచిన దగ్గర నుంచి ఆ రోజుంతా నిరసంగా అనిపిస్తుంది.

రెడ్ ఫ్లాగ్ పరిచినట్టే..
మీరూ నిద్రలేమితో బాధపడుతున్నారా? అలా అయితే.. ఆల్జిమర్స్ (మతిమరుపు) వ్యాధిని మీ జీవితంలోకి ఆహ్వానించనట్టే. నిద్రలేమి ఎక్కువ అయితే.. అది అల్జిమర్స్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు జనరల్ సైన్స్ ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కంటినిండ నిద్రపోయినవారు రోజంతా ఎంతో హుషారుగా ఉండటమే కాకుండా వారు చేసేపని కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణంతో నిండి ఉంటుందని తెలిపారు. సరైన నిద్రలేకపోతే.. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిసేందుకు రెడ్ ఫ్లాగ్ పరిచినట్టేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

మెల్లగా.. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది
చాప కింద నీరులా వ్యాపించే ఆల్జీమర్స్ వ్యాధి ప్రారంభంలో బ్రెయిన్ లో కలిగే మార్పులకు సంబంధించి లక్షణాలు పెద్దగా కనిపించవు. దశాబ్దాల తరువాత ఈ ప్రభావం కనిపిస్తుంది. మతిమరుపు రావడం, గందరగోళానికి గురికావడం, ఆలోచన శక్తి నశించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్ ఫంక్షన్ మార్పులు సంభవించి అల్జిమర్స్ గా రూపాంతరం చెందుతాయి. 60ఏళ్లు, పైబడిన 119 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో 80శాతం మందికి ఆల్జీమర్స్ ప్రభావం సాధారణంగా ఉందని, మిగతావారిలో బలహీనంగా ఉన్నట్టు గుర్తించారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా ఇంట్లో వారంలో ఉదయం, రాత్రి వేళల్లో నిద్రపోయిన సమయాలను జతచేసి విశ్లేషించారు. స్లో వేవ్ స్లిప్ ఉన్నవారిదే పరిపూర్ణమైన నిద్రగా గుర్తించారు. వీరిలో ఎక్కువగా రాత్రి సమయాల్లో నిద్రించినవారే ఉన్నారని తేలింది. ఇక పగటిపూట నిద్రించినవారిది అసంపూర్ణమైన నిద్రగా గుర్తించినట్టు నిపుణులు వెల్లడించారు.