కరోనా ఖతమే : వుహాన్‌ నగరమంతా స్ప్రే కొడుతున్న చైనా

  • Published By: sreehari ,Published On : February 11, 2020 / 03:43 AM IST
కరోనా ఖతమే : వుహాన్‌ నగరమంతా స్ప్రే కొడుతున్న చైనా

Updated On : February 11, 2020 / 3:43 AM IST

ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కరోజులోనే 108 మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మందికి వైరస్ సోకి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్నారు.

ఇళ్లలోనుంచి ఎవరిని బయటకు రానివ్వడం లేదు. సిటీలోని రోడ్లన్నీ నిర్మూనుష్యంగా కనిపిస్తున్నాయి. హాలీవుడ్ హర్రర్ మూవీ రెసిడెంట్ ఈవిల్ మూవీ మాదిరిగా కనిపిస్తోంది వుహాన్ సిటీలోని పరిస్థితి. బయటకు వస్తే… వైరస్ ఎక్కడ సోకుతుందోనని హడలిచస్తున్నారు. అధికారులు కూడా నగరవాసులను అత్యవసర పని ఉన్నప్పటికీ బయటకు రానివ్వడం లేదు.

గాలి ద్వారా వేగంగా వ్యాపించే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు చైనా ఎప్పటికప్పుడూ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైరస్ తీవ్రతను నివారించేందుకు వుహాన్ సిటీ అంతటా నివారణ మందులతో స్ప్రే చేస్తోంది. చైనా రాష్ట్ర సొంత పత్రిక పీపుల్స్ డెయిలీ.. వుహాన్ సిటీలో కరోనా నిరోధించడం కోసం జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో రోల్ గెయింట్ మిషన్లలో ఖాళీగా ఉన్న రోడ్లపై భారీ పైపులతో స్ప్రే కొడుతున్నారు.

అపోకలిప్టిక్.. క్రిమిసంహారక సంబంధమైన స్ప్రే భారీ ప్లూమ్స్ గాల్లోకి వదులుతున్నారు. ట్రక్కులన్నీ వరుసగా వీధులన్నీ తిరుగుతూ వైరస్ సోకుకుండా ఉండేందుకు గాలిలో స్ర్పే కొడుతున్నాయి. దట్టమైన తెల్లటి పొగమంచు మాదిరిగా నగరమంతా నిండిపోతోంది.

ఇంతకీ వుహాన్ సిటీలో అధికారులు వైరస్ నివారణకు ఏ మందును గాల్లోకి వెదజుల్లుతున్నారో స్పష్టత లేదు. బిజినెస్ ఇన్ సైడర్ రిపోర్టుల ప్రకారం.. తక్కువ సాంద్రత కలిగిన బ్లీచ్-అండ్-వాటర్ మిశ్రమం అయి ఉండొచ్చుని అంటోంది.

కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చైనా అనేక నగరాలను 50 మిలియన్ల మంది నివాసితులను నిర్బంధంలో ఉంచింది. ఇప్పటివరకూ కనీసం 910 మంది వైరస్ సోకి మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ కేసులను నిర్ధారించారు.

జాన్ హాప్కిన్స్ కరోనా వైరస్ డ్యాష్ బోర్డు ప్రకారం… సిటీ వైడ్ స్టెరిలైజేషన్ క్యాంపెయిన్ అంటే గాలిలో ఉండే కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రక్రియ. ఆసుపత్రులు, మార్కెట్లలో ఉపరితలాలను వెంటనే శుభ్రం చేయడం ద్వారా వైరస్ ప్రభావం నుంచి రక్షించుకోవచ్చునని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.