Morning Health Tips: ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు.. ఒకసారి ట్రై చేయండి

Morning Health Tips: పరగడుపున లెమన్ హనీ వాటర్ తీసుకోవం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Morning Health Tips: ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు.. ఒకసారి ట్రై చేయండి

Morning tips for Good Health

Updated On : July 15, 2025 / 10:46 AM IST

ప్రస్తుతం మన జీవనశైలి చాలా వేగంగా మారిపోతోంది. రోజంతా శక్తిగా, ఉత్తేజంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం పరగడుపున కొన్ని ప్రకృతిసిద్ధమైన పదార్థాలను తీసుకుంటే, అవి శరీరాన్ని డిటాక్స్ చేసి, మెటబాలిజాన్ని మెరుగుపరచి, రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. అందుకే ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం చాలా అవసరం. మరి ఆ ఆహారం ఏంటి? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం పరగడుపున తీసుకోవలసిన పదార్థాలు:

1.లెమన్ హనీ వాటర్:
పరగడుపున లెమన్ హనీ వాటర్ తీసుకోవం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని తళతళలాడేలా చేస్తుంది.

2.మెంతి గింజల నీరు:
మెంతి గింజల నీరును ఉదయం తాగడం వల్ల మధుమేహ నియంత్రణలో ఉంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్, జీర్ణవ్యవస్థ మెరుగుదల లాంటి అనేకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట ఒక స్పూన్ మెంతి గింజలు నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని పరగడుపున తాగాలి.

3.ఆమ్లా జ్యూస్:
ఇందులో విటమిన్ C సమృద్ధిగా. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. 20 మిల్లీలీటర్ల ఆమ్లా జ్యూస్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

4.చియా సీడ్స్ వాటర్:
చియా సీడ్స్ వాటర్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. శరీరంలో హైడ్రేషన్ పెరుగుతుంది. ఒక స్పూన్ చియా గింజలను గ్లాస్ నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, ఉదయం తాగాలి.

5.గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ:
ఈ రెండు రకాల టీ లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటిని ఉదయం తీసుకోవడం వల్ల బడీ డిటాక్సిఫికేషన్, మెటబాలిజం పెరుగుతుంది. చక్కర, తేనే లాంటివి కలపకుండా, ఉదయం ఒక కప్పు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ముఖ్య సూచనలు:

  • ఈ పదార్థాలను తీసుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీరు తాగడం మంచిది.
  • క్రమం తప్పకుండా తీసుకుంటే మాత్రమే ఫలితాలు కనిపిస్తాయి.
  • ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

ఉదయం పరగడుపున ప్రకృతిసిద్ధమైన పానీయాలు లేదా పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి మంచి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు. ఇవి మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడతాయి. మీ రోజును శక్తివంతంగా ప్రారంభించండి.. ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా మీ సొంతం అవుతుంది!