Coronavirus గురించి ఈ అపోహలు మర్చిపోండి

Coronavirus గురించి ఈ అపోహలు మర్చిపోండి

Updated On : March 13, 2020 / 7:44 PM IST

ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్ అని వణికిపోతుంటే ఏం పరవాలేదు. మా దగ్గర మందుంది. ఈ చిట్కా వాడితే తగ్గిపోతుందంటూ వృథా కబుర్లు చెబుతున్నారు. వాళ్లేదో ధైర్యం కోసం చెప్పారని అనుకుంటే పరవాలేదు. కానీ, అవే ప్రామాణికంగా తీసుకుని గుడ్డిగా ఫాలో అయితే మహమ్మారి బారిన పడకతప్పుదు. ఆరోగ్యం గురించి సలహా తీసుకునే ముందు ఎదుటి వ్యక్తి పరిణితి ఏంటో తెలుసుకోండి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా గురించి ప్రత్యేక సూచనలు ఇచ్చింది. అవి తెలుసుకుని వాటిని పాటించడం ఉత్తమం. ఇదే క్రమంలో వైరల్ గా మారిన కొన్ని అపోహలను మీ ముందు ఉంచుతున్నాం. వీటిని గుడ్డిగా నమ్మకండి. (భారత్‌లో రెండో మృతి, కరోనాతో పోరాడి ఓడిన మహిళ)

ఫేస్ మాస్క్: 
ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదల అయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు. కానీ, ఆ తర్వాత మనం చేతులు శుభ్రం చేసుకోకుండా మన శరీరంపై పడి ఉన్న క్రిములను ముఖంపైకి, చెవులలో లేదా ఇతర భాగాలకు తాకడం ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉంది. పైగా ఫేస్ మాస్క్ ఒకవైపున మాత్రమే ధరించాలి. రెండో వైపుకు తిప్పి వాడకూడదు.

గార్లిక్(వెల్లుల్లి):
కొందరు అతి తెలివి ఉపయోగించి వెల్లుల్లి పాయ తింటే కరోనా విరుగుడు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలా చేశామంటే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నవాళ్లం అవుతాం. కరోనాకు వెల్లుల్లికి సంబంధమే లేదు. (కరోనా కంట్రోల్ కోసం…మహారాష్ట్రలోని 5సిటీల్లో అన్నీ బంద్)

మినరల్స్ ఎక్కువగా తీసుకోవడం:
శరీరానికి సరిపడ మినరల్స్ తీసుకోవడం వల్ల వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. క్లోరిన్ డయాక్సైడ్ శరీరానికి బాగా ఉపయోగపడుతుందని చెప్తుంటారు. అది కేవలం సాధారణ అనారోగ్యానికి మాత్రమే పనిచేస్తుంది. 

వేడి:
వేడిగా ఉన్న వాతావరణంలో కరోనా బతకదు. ఉష్ణోగ్రతను బట్టి కరోనా వైరస్.. మనుగడ ఉంటుందనేది వాస్తవమే. కానీ, ఆస్ట్రేలియా లాంటి ఏరియాల్లో సమ్మర్ వాతావరణమే ఉన్నా కరోనా వ్యాప్తి వేగంగా నడుస్తుంది.