కరోనా వైరస్ పేరు మారింది.. ఇకపై ఇలానే పిలవాలంట!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పేరు మారింది. ఇప్పటి నుంచి కరోనా వైరస్ ను కొత్త పేరుతోనే పిలవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కరోనా అంటే.. (2019-nCoV)పేరుతో పిలిచేవారు.. ఇకపై నుంచి కొత్త కరోనా వైరస్ (Covid-19)అని పేరుతో పిలవాలంట.
జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెండ్రాస్ అద్నామ్ ఘెబ్రిసియోస్ మీడియాకు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడంతో 1000కు పైగా మృతిచెందారు. పది వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది. ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారిని సాధ్యమైనంత తొందరగా నిరోంధించాల్సిన అవసరం ఉందని అద్నామ్ ఘెబ్రిసియోస్ అన్నారు.
కరోనా వైరస్ అనే పదం.. దాని జాతికి బదులుగా ఒక వైరస్ సమూహాలను చెందినదిగా సూచిస్తుంది. వైరస్ వర్గీకరణలపై కరోనా వైరస్.. SARS-CoV-2గా అంతర్జాతీయ కమిటీ వర్గీకరించింది. ప్రాణాంతక వైరస్ లు ఎన్నో ప్రబలుతున్నాయి. ఒక్కో వైరస్ ఒక్కో శాస్త్రీయ నామం ఉంటుంది. ఆ వైరస్ జాతి బట్టి వర్గీకరిస్తుంటారు పరిశోధకులు. వైరస్ పేర్లపై ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు రీసెర్చర్లు అధికారిక పేరుతో పిలుస్తున్నారు.
అదే Covid-19 అనే కొత్త పేరు పెట్టారు. జీయోగ్రాఫికల్ లొకేషన్ సూచించకుండా ఉండేలా ఒక పేరును కనిపెట్టారు. ఒక జంతువు పేరు కానీ లేదా వ్యక్తగతంగా లేదా మనుషుల పేర్లతో సరిపోలకుండా ఉండేలా ఈ పేరు పెట్టారు. వైరస్ కు సంబంధించి ఉండేలా సులభంగా పలికేలా వైరస్ పేరు పెట్టడం జరిగిందని WHO చీఫ్ తెలిపారు.
ఏదైనా కొత్త వైరస్ పుట్టుకొచ్చినప్పుడు పాత వైరస్ పేర్లతో కలిపి పిలుస్తుంటారు. ఇతర వైరస్ పేర్లతో పిలవడం కారణంగా గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. ఇతర వైరస్ పేర్లను వాడకుండా నిరోధించడానికి ఒక పేరు ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏదైనా కరోనావైరస్ వ్యాప్తికి వాడటానికి ఇది ఒక ప్రామాణిక ఫార్మాట్‌ను ఇస్తుందని చెప్పారు.
కరోనా వైరస్ కొత్త పేరు.. ‘Corona’ అనే పదాల నుంచి తీసుకోవడం జరిగింది.. ‘‘virus’’ ‘‘disease’’తో పాటు 2019 సంవత్సరాన్ని (డిసెంబర్ 31న కరోనా వైరస్ ఉద్భవించినట్టు డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు) సూచించేలా పెట్టారు. చైనా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 42,200 లకు పైగా కరోనా వైరస్ బాధితులు మృతిచెందారు. 2002-2003లో విజృంభించిన SARS అంటువ్యాధి కారణంగా మరణాల సంఖ్యను కూడా కరోనా దాటేసింది.
ఒక్క సోమవారం రోజే హుబేయ్ ప్రావిన్స్ లో 103 మంది కరోనా సోకి మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,016కు చేరింది. కానీ, దేశవ్యాప్తంగా కొత్త ఇన్ఫెక్షన్ సోకింది. ఆ రోజుకు ముందు నమోదైన కొత్త కేసులు 3,062 నుంచి 2,478 చేరి 20 శాతానికి తగ్గాయి.