నిద్రలో కలలపై కరోనా ఎఫెక్ట్.. ఒత్తిడికి మందు ఇదొక్కటే!

అసలే కరోనా భయం.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు ప్రతిఒక్కరిలోనూ కరనా కలవరమే కనిపిస్తోంది. ఏది ముట్టుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కరోనాకు సంబంధించి విషయాలే చుట్టూ తిరుగుతుంటాయి. కరోనా గురించి తప్ప మరో విషయం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ప్రభావంపై మనుషులపై ఎంతగా చూపిస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇళ్లలోనే ఉన్నప్పటికీ కరోనా భయం వదలడంలేదు. ఆఖరికి నిద్రలోనూ కరోనా ప్రభావం పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కరోనాకు ముందు కంటే ఇప్పుడు నిద్రతోపాటు కలల్లో కూడా మార్పులు వచ్చాయని పరిశోధకులు అంటున్నారు. ఇంట్లోనే ఉంటున్న వారిలో చాలామందిలో ఎక్కువగా నిద్రపోతున్నారంట.. నిద్రపోయినంత సేపు అధికంగా కలలు కనేస్తున్నారంట.
అంతేకాదు.. కరోనా ఆందోళనతో సరిగా నిద్రపోలేకపోతున్నారని కూడా తేలింది. సరిగా నిద్రపట్టక మధ్యలోనే మెలకువ వచ్చేసి అటు ఇటూ తిరిగేస్తున్నారంట. సాధారణంగా కలలు కనే సమయంలో సడన్ గా మెలకువ వచ్చేస్తుంది. అప్పుడు కల కొద్దిగా మాత్రమే గుర్తుంటుంది.. లేచాక కొంత కల మరిచిపోతుంటారు . కరోనా సమయంలో కనే కలలు ఎక్కువగా గుర్తుంటున్నాయని గుర్తించారు పరిశోధకులు.
ఆందోళన ఎక్కువగా ఉన్నవారిలో కలలపై స్పష్టత ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు.. కల వచ్చినప్పుడు.. కన్న ఆ కలను ఇతరులకు చెప్పడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చునని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇళ్లలో ఉండేవారంతా ఎలాంటి ఆందోళనలు, భయాలు పెట్టుకోకుండా కంటినిండా హాయిగా నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.