అదే నిమిషం.. అదే క్షణంలో.. : ఒకేసారి చనిపోయిన భార్యభర్తలు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఓ తియ్యని క్షణం. పెళ్లి అనే బంధంతో ఒక్కటైన దంపతులు చచ్చేవరకు తోడుగా కలిసి ఉండాలనేది నానుడి. అదే ఆలుమగల బంధం. స్వచ్ఛమైన ప్రేమతో భార్యభర్తల బంధానికి సరైన అర్థం ఇదే అని చాటిచెప్పే రియల్ స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. 

  • Published By: sreehari ,Published On : January 29, 2019 / 09:14 AM IST
అదే నిమిషం.. అదే క్షణంలో.. : ఒకేసారి చనిపోయిన భార్యభర్తలు

Updated On : January 29, 2019 / 9:14 AM IST

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఓ తియ్యని క్షణం. పెళ్లి అనే బంధంతో ఒక్కటైన దంపతులు చచ్చేవరకు తోడుగా కలిసి ఉండాలనేది నానుడి. అదే ఆలుమగల బంధం. స్వచ్ఛమైన ప్రేమతో భార్యభర్తల బంధానికి సరైన అర్థం ఇదే అని చాటిచెప్పే రియల్ స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. 

ఇప్పుడే పెళ్లి.. అంతలోనే విడాకులు అనే రోజులు ఇవి. పెళ్లికి ముందు ప్రేమ అంటారు.. పెళ్లి అయ్యాక.. కొన్ని ఏళ్లకే విడిపోతుంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి ప్రేమ పెళ్లిళ్లు వరకు ఎన్నో దాంపత్య బంధాలు మధ్యలోనే అర్థాంతరంగా సమసిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న గొడవలకే దంపతులు బ్రేకప్ చెప్పుకుంటున్న పరిస్థితులు. బ్రేకప్ చెప్పిన క్షణాల్లోనే మరో పెళ్లికి సిద్ధమైపోతుంటారు. ఇలా ఎందరో ఏదో ఒక కారణంతో తమ వివాహ జీవితాన్ని క్షణికావేశంలో తుంచేసుకుంటున్న ఘటనలు మరెన్నీ. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఓ తియ్యని క్షణం. పెళ్లి అనే బంధంతో ఒక్కటైన దంపతులు చచ్చేవరకు తోడుగా కలిసి ఉండాలనేది నానుడి. అదే ఆలుమగల బంధం. స్వచ్ఛమైన ప్రేమతో భార్యభర్తల బంధానికి సరైన అర్థం ఇదే అని చాటిచెప్పే యథార్థ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 

రోజులు కాదు.. గంటలు కాదు.. క్షణాల్లోనే
70ఏళ్ల వైవాహిక జీవితాన్ని అనుభవించిన వృద్ధ దంపతులిద్దరూ ఆఖరి క్షణాల్లో కూడా కలిసే ప్రాణాలు వదిలారు. రోజులు కాదు.. గంటలు కాదు.. క్షణాల వ్యవధిలో చేతుల్లో చేయి వేసుకొని తనువు చాలించి.. నిజమైన ప్రేమకు నిలువుట అద్దంలా నిలిచారు ఈ వృద్ధ దంపతులు. వారే.. నార్మా జూన్ ప్లాటెల్ (90), ఫ్రాన్సిస్ ఎర్నెస్ట్ ప్లాటెల్ (92). నార్మా ఎడ్యుకేటడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్సిస్ పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. నార్మాకు రచనలంటే ఎంతో ఇష్టం. ఫ్రాన్సిస్ నార్మాను ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లింది. అలా వీరి వైవాహిక జీవితం ఆరంభమైంది.   

మరణంలోనూ తోడునీడగా..
పెళ్లైన నాటి నుంచి ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. ఎన్నో కష్టాలొచ్చిన కలిసే ఎదుర్కొన్నారు. వైవాహిక జీవితంలో కష్టనష్టాలను పాలుపంచుకుంటూ ముందుకు సాగారు. చివరికి చనిపోయే ముందు కూడా కలిసే చనిపోయారు. చివరి రోజుల్లో నార్మా ప్లాటెల్ అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో బాధపడుతుండేది. భర్త ఫ్రాన్సిస్ తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా క్రమంగా మృత్యువుకు చేరువయ్యాడు. చివరికి ఆస్పత్రిలో చేరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్త పక్కనే నార్మా కూడా ఉండిపోయింది. పక్క పక్క బెడ్ లో పడుకున్న వీరిద్దరూ జనవరి 6న రాత్రి తుది శ్వాస విడిచారు. మరణంలోనూ వీడని బంధంతో పెనవేసుకొన్న వృద్ధ దంపతులకు కుటుంబ సభ్యులే కాదు.. స్నేహితులు, శ్రేయాభిలాషులందరో వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వృద్ధ దంపతుల యానివర్శరీ రోజున వీరి నిజమైన ప్రేమకు గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వృద్ధ దంపతుల జీవితానికి సంబంధించి స్టోరీని నికోలస్ స్పార్స్ నోట్ బుక్ లో ప్రచురించారు. వీరి జీవితం ఆధారంగా సినిమా కూడా వచ్చింది.