పాలు తాగితే.. నిజంగా ఎత్తు పెరుగుతారా?

పాలు.. పౌష్టికాహారమని తెలుసు. పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. పిల్లలు ప్రతిరోజు పాలు తాగితే బలంగా ఉంటారని, ఆటల్లో, చదువుల్లో ఎంతో చురుకుగా ఉంటారని చెబుతుంటారు. ప్రతిరోజు పాలు ఎక్కువ మోతాదులో తాగే పిల్లల్లో వారి ఎముకలు బలిష్టంగా తయారువుతాయని అంటారు. పాలు తాగిన పిల్లలు ఎత్తు కూడా తొందరగా పెరుగుతారని చెప్పడం కామన్. నిజానికి ఎత్తు పెరగడమనేది జన్య సంబంధిత అంశం. గత కొన్నిఏళ్లుగా తెల్లని ద్రవపదార్థమైన పాలల్లో క్రమంగా చిన్నపాటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇందుకు చాలా కారణాలు చెప్పవచ్చు. ఆవు పాలు అధికంగా తాగేవారిలో ఆరోగ్యపర పరిణామాలు ఉన్నప్పటికీ.. జంతువులకు వాటి జీవితకాలంలో హార్మోన్లు, యాంటిబయాటిక్స్ తీసుకోవడం కారణంగా పాలు తాగే చిన్న పిల్లల్లో ఎక్కువగా డైరీ అలర్జీల రేటు పెరిగిపోతూ వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సోయా నుంచి బియ్యం వరకు ప్రతీది ప్లాంట్ ఆధారిత పాలను పిల్లలకు ఇవ్వాలనే ఆలోచన ఎంతవరకు సమంజసం.. శాస్త్రీయంగా చెప్పాలంటే.. పిల్లల పెరుగుదలపై పాలు వాస్తవంగా ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? అనేది ప్రశ్న.
జన్యుపరంగానే పెరుగుదల :
మరో విషయం ఏమిటంటే? ఎత్తు పెరగడం అనేది జన్యపరంగా సంభవించే ప్రక్రియ. జెనటిక్స్ ఆధారంగా ఎత్తు పెరగడం జరుగుతుంది. కేవలం పాలు తాగితే ఎత్తు పెరుగుతారనడానికి శాస్త్రియంగా ఆధారాలేమి లేవు. పాలు తాగితే ఎత్తు పెరుగుతారా? అనేదానిపై ఆంత్రోపాలిజిస్ట్ అండ్రేయా విలే ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధన చేస్తున్నారు. 100ఏళ్లలో కూడా జన్యుపరంగానే ఎత్తు పెరగడానికి అవకాశాలు ఎక్కువని గుర్తించినట్టు తెలిపారు. మీ కనీస ఎత్తు అనేది మీ వంశీకుల జన్యులపై ఆధారపడి ఉంటుంది. ఎత్తు పెరగాలని పాలు వంటి ఎన్నో గ్రోత్ ప్రొటీన్లు తీసుకున్న పనిచేయవంట.
పాలు.. ప్రోటీన్ ఫ్యాక్టర్-1 లేదా IGF-1 సమ్మెళనం.. ఇది పిల్లల్లో ఎత్తు పెరిగే లోపాలను తరచూ సరిచేస్తుంటుంది. కానీ, పాలు ఎక్కువగా తాగడం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. అది సహజంగా మనిషి శరీరంలోనే ఇదివరకే ఉత్పత్తి అయి ఉండాలి. ‘నా ఉద్దేశం ప్రకారం.. జన్యుపరంగానే ఎత్తు పెరగడానికి సాధ్యపడుతుంది. ఒకవేళ మీరు నిజంగా ఎత్తు పెరుగుతున్నా.. ప్రోటీన్ గ్రోత్ IGF-1 అదనంగా తీసుకుంటే మరింత ఎత్తు పెరుగుతారని నేను అనుకోను’ అని విలే అభిప్రాయపడ్డారు.
ఆవు పాలతో పెరుగుదల సాధ్యమే : రీసెర్చ్
చిన్న పిల్లలకు ప్రతిరోజు ఆవు పాలు తాగేలా చూస్తే.. వారిలో పెరుగుదల మెరుగుపడినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. ఆవు పాలు తాగిన పిల్లల్లో ఎత్తు పెరగడం ప్రభావంతంగా ఉన్నట్టు తెలిపింది. 2017లో ఈ అధ్యయానికి సంబంధించి జనరల్ క్లినికల్ న్యూట్రీషియన్ లో ప్రచురితమైంది. దీని ప్రకారం.. ప్రతి రోజు 8 ఔన్సుల ఇతర జంతువుల పాలు తాగిన వాళ్లకు.. ప్రతిరోజు అదే మోతాదులో ఆవు పాలు తాగిన చిన్నారులకు మధ్య తేడాను గుర్తించినట్టు పేర్కొంది. ఈ రెండు గ్రూపుల మధ్య చిన్న వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. డైరీ పాలు తాగిన వాళ్ల కంటే ఇతర జంతువుల పాలు తాగినవారిలో సగటున 0.2 అంగుళాలు తక్కువగా పెరిగినట్టు గుర్తించారు. 3ఏళ్ల పిల్లల్లో ఆవు పాలు తాగిన వాళ్ల కంటే ఇతర పాలను తాగినవారిలో అర అంగుళం మేర తక్కువగా పెరిగినట్టు గుర్తించారు.
పాలల్లో ఎన్నో పోషకాలు :
పీడియాట్రిక్ ఎండోక్రినోలాజిస్ట్ మార్క్ డెబియార్ మాట్లాడుతూ.. ఈ అధ్యయనం.. ఆవు పాలలో ఎత్తు పెరిగేందుకు అవసరమైన ప్రోటీనులు ఉన్నాయని సూచిస్తోంది. ఆవు పాలకు మరిన్ని హార్మొన్లను జోడిస్తే మరి మంచిదన్నారు. లాక్టోస్ తక్కువగా ఉన్న పిల్లల్లో పెరుగుదల కనిపించినప్పటికీ, వారిలో అలర్జీ వంటి సమస్యలు ఉండే అవకాశం ఉందన్నారు. నిజంగా.. పాలు ఎత్తు పెరగడానికి నిజంగా ఉపకరిస్తాయా? అంటే.. ఒక విషయం కచ్చితంగా చెప్పవచ్చు అంటున్నారు విలే.. మీ ఆరోగ్యానికి మంచిది.
పాలలో ఎక్కువ మోతాదులో క్యాలరీలు ఉంటాయని అనడంలో ఎలాంటి ప్రశ్నేలేదు. ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ పుష్టిగా ఉంటాయి. పాలు.. మంచి పౌషకాహారమైన ఆహారం కూడా. ఒకవేళ, పాలు డైట్ లో భాగమైతే.. పిల్లలకు మంచి పోషకాహారం అందిస్తునడంలో సందేహం లేదు.