టాల్కమ్ పౌడర్ తో క్యాన్సర్ ముప్పు? : జాన్సన్స్ బేబీ పౌడర్ అమ్మకాలు ఆ దేశాల్లో నిలిపివేత

అమెరికా, కెనడా దేశాలలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే నెలల్లో ఈ రెండు దేశాల మార్కెట్లలో అమ్మకాలను నిలిపివేస్తున్నామని నార్త్ అమెరికా కన్స్యూమర్ యూనిట్ ఛైర్మన్ కాథ్లీన్ విడ్మెర్ చెప్పారు. సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రీటైల్ మార్కెట్లటలో అమ్మకాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు. అయితే 1980 నుండి మార్కెట్లో ఉన్న తమ కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలు అమెరికా, కెనడాలో కొనసాగుతాయన్నారు.
ఈ ప్రొడక్ట్ వాడటంతో తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో గడిచిన మూడేళ్లల్లో 60శాతం సేల్స్ పడిపోవడం, దాదాపు 20వేల కేసులు…కోట్ల డాలర్ల పరిహారం వంటి అంశాల నేపథ్యంలో ఈ అమెరికా ఫార్మా దిగ్గజం బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలను కంపెనీ ఖండించింది. ఉత్తర అమెరికాలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని,వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్ అండ్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే 2014 నుంచి జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తుల్లో ఆస్‌బెస్టాస్ ఆనవాళ్లు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో వేలాది మంది కోర్టుల్లో కేసులు వేశారు. దీంతోపాటు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలో ఒక బాటిల్ బేబీ పౌడర్‌లో కలుషిత, ప్రమాదకర అవశేషాలను కనుగొన్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో 33వేల బాటిళ్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపిన విషయం తెలిసిందే.
టాల్కమ్ పౌడర్ తో క్యాన్సర్ వస్తుందా?
టాల్కమ్ పౌడర్ క్యాన్సర్‌కు కారణమవుతుందని సూచించడానికి గట్టి మరియు వేగవంతమైన ఆధారాలు లేవు, కాని కొన్ని రకాల లింక్ ఉందని కేసుల అధ్యయానాలు సూచించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. ఒకవేళ కణాలు కనుక యోని, గర్భాశయం మరియు ఫెలోపియన్ గొట్టాల ద్వారా అండాశయాలకు వెళితే మాత్రం టాల్క్… అండాశయ క్యాన్సర్(ovarian cancer)కు కారణమవుతుందని అది గతంలో సూచించింది. కాని కనుగొన్నవి చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది.
చాలా అధ్యయనాలు మహిళలలో… టాల్కం పౌడర్ మరియు అండాశయం క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించాయి. వీటిల్లో మిక్స్ డ్ ఫలితాలు కన్పించాయి. కొన్ని అధ్యయనాలు… కొంచెం పెరిగిన ప్రమాదాన్ని రిపోర్ట్ చేయగా, కొన్ని పెరుగుదల లేదని రిపోర్ట్ చేసినట్లు 2017 లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. ఈ టాల్క్ పౌడర్ వల్ల ప్రమాదంలో చిన్న పెరుగుదల ఉంటుందని అనేక కేస్-కంట్రోల్ స్డడీస్ కనుగొన్నాయి.
టాల్కమ్ పౌడర్ అంటే ఏమిటి?
టాల్కమ్ పౌడర్ టాల్క్(ముడిపదార్థం) నుండి తయారవుతుంది. ఇది ప్రధానంగా మెగ్నీషియం, సిలికాన్ మరియు ఆక్సిజన్ కలిగి ఉంటుంది. ఈ పౌడర్ పొడి తేమను గ్రహిస్తుంది మరియు ఘర్షణను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది మరుగుదొడ్లు మరియు ఇతర వ్యక్తిగత సంరక్షణ వస్తువులను విక్రయించే కెమిస్ట్ లేదా దుకాణం యొక్క షెల్ఫ్‌లోని ఉత్పత్తులలో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దాని సహజ రూపంలో కొన్ని టాల్క్ ఆస్బెస్టాస్ ను కలిగి ఉంటుంది. ఇది పీల్చేటప్పుడు ఊపిరితిత్తులలో మరియు దాని చుట్టుపక్కల క్యాన్సర్లకు కారణమవుతుంది. అయితే, గృహ టాల్క్ ప్రొడక్ట్ లలో ఆస్బెస్టాస్ లేదు. భారతీయులు చాలామంది చెమట పోడానికి, చెమట కంపు లేకుండా ఉండడానికి టాల్కమ్ పౌడరును ఇప్పటికీ వాడుతున్నారు.