Stress: అధిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే వీటికి దూరంగా ఉండండి

ఒత్తిడి అనేది కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగినప్పుడు వస్తుంది.

Stress: అధిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే వీటికి దూరంగా ఉండండి

Over Stress

Updated On : June 8, 2025 / 2:35 PM IST

ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఒత్తిడి. సామాజిక, ఆర్ధిక, మానసిక ఇలా కారణం ఏదైనా ఒత్తిడి అనేది మనిషి జీవితంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడిని అధిగమించడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నిజానికి ఒత్తిడి అనేది కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగినప్పుడు వస్తుంది. కానీ, మనిషి జీవన విధానంలో చేసుకునే చిన్న చిన్న మార్పుల కార్టిసాల్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడొచ్చని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఒత్తిడికి కారణమయ్యే విషయాల గురించి ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ టామ్ నిక్కోలా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • మొబైల్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, లేదా కాల్స్ వచ్చినప్పుడు దేని గురించో సహజంగా ఒక ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. దానివల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడి ఒంట్లో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.
  • మనం చుట్టూ వినిపించే వాహనాల శబ్దాలు కూడా మైండ్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అవి ఒకరకమైన చికాకును క్రియేట్ చేస్తాయి. ఆ చికాకు వల్ల కూడా ఒత్తిడి ఏర్పడుతుంది.
  • ఒకేసారి ఒకటికి మించి పనులు చేయడం కూడా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. దానివల్ల చికాకు ఏర్పడుతుంది. క్రమంగా కార్టిసాల్ పెరుగుదలకు కారణం అవుతుంది.
  • సోషల్ మీడియాలో, టీవీల్లో కనిపించి, వినిపించే భయానక వార్తలు కూడా కొన్నిసార్లు ఒత్తిడికి కారణం అవుతాయి. అందుకే.. అలాంటి వార్తలకు దూరంగా ఉండాలి.
  • పని సమయాల్లో ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం కూడా ఒత్తిడికి కారణం అవుతుంది. ఇది శరీరంలో చక్కర స్థాయిలను పెంచుతుంది. కీళ్లలో ఒత్తిడి క్రియేట్ అయ్యి కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.
  • ఇంట్లో ఉపయోగించే వైఫై కూడా మైండ్ పైన ప్రభావం చూపిస్తుంది. వైఫై నుండి వెలువడే తరంగాలు సైలెంట్ కిల్లర్స్ గా పనిచేస్తాయి. అందుకే కనీసం రాత్రి సమయాల్లో అయినా వైఫై ని ఆఫ్ చేస్తే బెటర్. నిద్ర కూడా బాగా పడుతుంది. శరీరానికి కాస్త విరామం దొరుకుతుంది.