Guava Leaf Tea Benefits: టీ లందు జామ ఆకు టీ శ్రేష్ఠమయా.. రోజూ తాగితే ఎన్నో రోగాలు మాయమయా
Guava Leaf Tea Benefits: షుగర్ పేషేంట్స్ కి జామ ఆకు టీ ఒక వరం అనే చెప్పాలి. జామ ఆకులు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Health benefits of drinking guava leaf tea daily
టీ.. మనిషి ఆహార పట్టికలో ఇది ఒక భాగంగా మారిపోయింది. ఉదయాన్నే వేడి వేడి టీ తాగండి చాలా మందికి రోజు స్టార్ట్ అవ్వదు. అయితే, టీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది కాబట్టి టీ ప్రత్యామ్నాయంగా చాలా రకాల టీలు వచ్చాయి. లేమన్ టీ, అల్లం టీ, బ్లాక్ టీఎం గ్రీన్ టీ. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి జామ ఆకు టీ. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. మరి జామ ఆకు టీ ప్రత్యేకత ఏమిటి? దానివల్ల మనిషి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
జామ ఆకు టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
1.బ్లడ్ షుగర్ కంట్రోల్:
షుగర్ పేషేంట్స్ కి జామ ఆకు టీ ఒక వరం అనే చెప్పాలి. జామ ఆకులు శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఉదయం జామ ఆకు టీ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది.
2.జీర్ణవ్యవస్థకు మేలు:
జామ ఆకుల్లో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు మన జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తాయి. తరుచుగా వచ్చే అజీర్ణం, వాంతులు, పొట్ట నొప్పి, డయేరియా వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
3.బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
జామ ఆకు టీ మేటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. దాంతో శరీరంలోని కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఇది పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
4.ఇన్ఫెక్షన్లు & వాపును తగ్గిస్తుంది:
జామ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటంతో చిన్నపాటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
5.ఇమ్యూనిటీ బలోపేతం:
జామ ఆకులలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుతాయి. శరీరాన్ని వైరస్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
6.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది:
జామ ఆకు టీ తాగటం వల్ల చర్మంలో నిగారింపు వస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఉల్లాసంగా మారుస్తాయి, మొటిమలు, చర్మం ముడతలను తగ్గిస్తుంది.
7.కొలెస్ట్రాల్ నియంత్రణ
జామ ఆకు ఈ టీ LDL (Bad Cholesterol) ని తగ్గించి, HDL (Good Cholesterol) ని పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జామ ఆకు టీ తయారీ విధానం?
ముందుగా జామ ఆకులను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. వాటిని నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. నీరు లేత బూడిద రంగు వచ్చేసరికి ఉంచి వడకట్టాలి. ఆ నీటిని కాస్త తేనె వేసి కలుపుకోవాలి. అంతే జమ ఆకు టీ సిద్ధం. ఈ టీని రోజుకు 1 లేదా 2 సార్లు తాగవచ్చు. అది కూడా ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.