భారత్ లో కరోనా స్థితి ఇదే : వైరస్ ను వేరు చేయగలిగాం…వ్యాక్సిన్ కు 2ఏళ్ల సమయం

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2020 / 11:46 AM IST
భారత్ లో కరోనా స్థితి ఇదే : వైరస్ ను వేరు చేయగలిగాం…వ్యాక్సిన్ కు 2ఏళ్ల సమయం

Updated On : March 12, 2020 / 11:46 AM IST

ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ఇటీవలే ఆ యువకుడు ఇటలీ నుంచి తిరిగి వచ్చినట్లుగా గుర్తించారు. ఆ యువకుడు కలిసిన ఐదుగురిలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే వారికి ప్రస్తుతం టెస్ట్ లు జరుగుతున్నాయి.

అయితే ఈ సమయంలో దేశంలో కరోనా వైరస్ స్థితిపై ఇవాళ(మార్చి-12,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నాతాధికారులు మీడియాతో మాట్లాడారు. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారులకు మంజూరు చేసిన వీసా రహిత ప్రయాణ సౌకర్యం 2020 ఏప్రిల్ 15 వరకు నిలుపుదల చేయబడింది. ఇది మార్చి 13,2020 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ లో ఇప్పటివరకు 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 17మంది విదేశీలు కాగా,56మంది భారతీయులు ఉన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం మాల్దీవులు,మయన్మార్,బంగ్లాదేశ్,చైనా,యూఎస్,యడగాస్కర్,శ్రీలంక,నేపాల్,దక్షిణాఫ్రికా,పెరూ వంటి దేశాలకు చెందిన 48మందితో కలిపి 900మంది విదేశాల్లోని భారతీయులను సేఫ్ గా స్వదేశానికి తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 56శాంపిల్ సేకరణ కేంద్రాలున్నాయి. దేశంలో ఇప్పటికే 1లక్ష వరకు టెస్టింగ్ కిట్ లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా టెస్టింగ్ కిట్ ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. అవి సేకరించే పనిలో ఉన్నాం.

మాస్క్ అనేది అన్నిసార్లు అవసరమైనది కాదు. ఎవరైనా ఒక వ్యక్తి సమర్థవంతమైన సామాజిక దూరాన్ని(సోషల్ డిస్టెన్స్) కొనసాగిస్తే ముసుగు అవసరం లేదు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి,అదృష్టవశాత్తూ భారతదేశానికి మనకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు. బయటి నుండి వచ్చిన కొన్ని కేసులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా అవి ప్రధానంగా వారి దగ్గరి కుటుంబ సభ్యుడిని ప్రభావితం చేశాయి. కరోనా గురించి అన్ని వాస్తవాలు ఇంకా అధ్యయనం చేయబడుతున్నాయి. నిర్ధారణ అధ్యయనాలు లేవు. కరోనా వైరస్…అధిక ఉష్ణోగ్రతలలో ఉంటే మనుగడలో ఇబ్బందులు పడతాయని సాధారణంగా భావిస్తున్నారు. కాని అది నిర్ధారించబడలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు కరోనా వైరస్ ను ఐసొలేట్(ఒంటరి లేదా వేరు)చేయగలిగామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. మనకు అలాంటి 11 ఐసోలేట్స్ ఉన్నాయని,వ్యాక్సిన్ కు ఇంకా 1.5-2సంవత్సరాల సమయం పడుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.

కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమైన విషయమని ఇవాళ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవసరమని ఆయన తెలిపారు. వీలైనంత వరకు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని జైశంకర్ ప్రజలకు విజ్ణప్తి చేశారు. ప్రయాణాలు చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పనేనని ఆయన తెలిపారు. 

See Also | మంత్రులకు కరోనా షాక్…జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపు