Lemon Tea Disadvantages: లెమన్ టీ తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.

Lemon Tea Disadvantages: లెమన్‌లో ఉండే సిట్రిక్ ఆమ్లం దంతాలను క్రమంగా కరిగించేస్తుంది. దీని వల్ల దంతాల పైపొర నశిస్తుంది.

Lemon Tea Disadvantages: లెమన్ టీ తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.

Health problems caused by Lemon tea

Updated On : June 28, 2025 / 2:36 PM IST

లెమన్ టీ.. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన టీ ఇది. చాలా మంది యువత మాములు టీ కంటే లెమన్ టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని ఎక్కువగా తాగుతుంటారు. ఇంకా ఈ టీ లో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సహాయపడతాయని నమ్మకం. కానీ, తాజా అధ్యాయనాలు మాత్రం లెమన్ టీ విషయంలో కాస్త జాగ్రత్త అని చెప్తున్నాయి. ప్రతిరోజూ లెమన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

లెమన్ టీ ఎక్కువగా తీసుకోవడం వచ్చే సమస్యలు:

1. దంత సమస్యలు:
లెమన్‌లో ఉండే సిట్రిక్ ఆమ్లం దంతాలను క్రమంగా కరిగించేస్తుంది. దీని వల్ల దంతాల పైపొర నశిస్తుంది. సెన్సిటివిటీ, నొప్పి రావచ్చు. కాబట్టి లెమన్ టీ ని స్ట్రా ద్వారా తాగడం, తాగిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.

2.గ్యాస్, అసిడిటీ సమస్యలు:
లెమన్ టీ అధికంగా తీసుకోవడం వల్ల శారీరంలో సిట్రసు ఆమ్లం పెరిగిపోతుంది. దీనివల్ల అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, గర్భిణీ స్త్రీలకు bloating వంటి సమస్యలు తలెత్తవచ్చు

3. మైగ్రేన్ & తలనొప్పులు:
లెమన్ టీ లో ఉండే టైరమిన్, సిట్రిక్ ఆమ్లం లాంటి కొన్ని సమ్మేళనాలు కొంతమందిలో మైగ్రేన్ లేదా విపరీతమైన తలనొప్పులను ప్రేరేపించవచ్చు. కాబట్టి, తలనొప్పి సమస్యలు ఉన్నవారు లెమన్ టీకి కాస్త దూరంగా ఉండటం మంచిది.

4.మలబద్ధకం లేక అతిసారం:
లెమన్ టీ తాగిన పద్ధతిని బట్టి కొన్ని సందర్భాల్లో మలబద్ధకం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. తక్కువ సమయాల్లో ఈ టీని ఎక్కువ తాగడం వల్ల అతిసారం సమస్య కూడా రావచ్చు. కాబట్టి, వర్షాకాలం లెమన్ టీకి దూరంగా ఉండటం మంచిది.

5.కిడ్నీ సమస్యలు:
లెమన్ టీ లో ఉండే సి విటమిన్, ఆక్సలేట్లు మూత్రపిండాల్లో కిడ్నీ రాళ్ల ఏర్పాటుకు కారణమయ్యే అవకాశముంది. కాబట్టి, కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు లెమన్ టీని తాగకపోవడం మంచిది.

6.హైడ్రేషన్ లోపం:
లెమన్ టీ డైయురెటిక్ లక్షణాలతో కొంతమేర దాహం తగ్గించడంతో పాటు నీటిని ఎక్కువగా బయటకు పంపిస్తుంది. దీని వల్ల కొన్ని సందర్భాల్లో హైడ్రేషన్ లోపం కలుగుతుంది. వేసవిలో ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్య మరింత అధికం కావచ్చు.

లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదే కాని, అధిక వినియోగం వల్ల పలు సమస్యలు రావచ్చు. ప్రెగ్నెంట్, మైగ్రేన్, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అయితే, లెమన్ టీ తాగడాన్ని వదిలివేయడం మంచిది.