Antacid Disadvantages: యాంటాసిడ్స్ ఎక్కువగా వాడుతున్నారా? చాలా డేంజర్.. ఈ జాగ్రత్తలు పాటించండి
Antacid Disadvantages: యాంటాసిడ్స్ కడుపులో ఉండే ఆమ్లాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఆటంకం కలుగుతుంది.

Disadvantages of Antacid
ఈ మధ్య కాలంలో కాలంలో చాలా మంది అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అజీర్తి సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే యాంటాసిడ్స్ వేసుకొని తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతారు. కానీ, అలా చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. నిజానికి యాంటాసిడ్స్ అనేవి ఒకరకమైన ఔషధాలు. ఇవి మన కడుపులో ఉండే అధిక ఆమ్లతను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అవి కడుపులో ఉన్న ఆమ్లాన్ని తటస్థ పరచడం ద్వారా మంట, అజీరణం, గ్యాస్, ఆమ్ల తాలూకు సమస్యల నుంచి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. మరి యాంటాసిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటాసిడ్స్ ఎప్పుడు వాడతారు?
- అజీర్ణం, మంట ఉన్నప్పుడు
- గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు
- ఆమ్లత కారణంగా ఛాతీలో మంట ఏర్పడినప్పుడు.
యాంటాసిడ్స్ వల్ల ఏర్పడే సమస్యలు/దుష్పరిణామాలు:
1.జీర్ణశక్తి తగ్గిపోవడం: యాంటాసిడ్స్ కడుపులో ఉండే ఆమ్లాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఆటంకం కలుగుతుంది. కాబట్టి, దీర్ఘకాలంలో జీర్ణాశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
2.విటమిన్స్, ఖనిజాలు జీర్ణం కాకపోవడం: Vitamin B12, ఐరన్, మగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరంలో చేర్చుకోవడానికి ఆమ్లం అవసరం. యాంటాసిడ్స్ వాడకం వల్ల ఇవి చీరిగి శరీరంలో జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలిక లోపాలు రావొచ్చు.
3.మూత్ర సంబంధిత సమస్యలు: మగ్నీషియం, కాల్షియం లాంటివి ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ రిస్క్ కూడా పెరుగుతుంది.
4.విరేచనాలు: అల్యూమినియం, మగ్నీషియం ఆధారిత యాంటాసిడ్స్ కొన్నిసార్లు విరేచనాలకు కారణం కావచ్చు.
యాంటాసిడ్స్ అవసరం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఆహారం మితంగా తీసుకోవడం
- మసాలా, కారం ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి
- భోజనం చేసిన తర్వాత వెంటనే కూర్చోవడం, పడుకోవడం చేయకూడదు
- జింజర్ టీ, సోంపు గింజలు వంటివి ఉపశమనం కలిగిస్తాయి
- డాక్టర్ సలహా మేరకు మాత్రమే యాంటాసిడ్స్ వాడాలి
యాంటాసిడ్స్ తాత్కాలిక ఉపశమనం కోసం మంచివే అయినప్పటికీ అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. అది కూడా తగిన పరిమితిలో వాడాలి. దీర్ఘకాలిక అసిడిటీ సమస్యలకైతే ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్టు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. శరీరాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచితే ఎలాంటి మెడిసిన్ పైన ఆధారపడాల్సిన అవసరం రాదు కదా.