Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్ట్, టిఫిన్ మానేస్తున్నారా.. కొత్త రోగాలను కొని తెచ్చుకున్నట్టే.. జాగ్రత్త సుమీ
Health Tips: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే శరీర మెటాబాలిజం స్థాయి క్షీనిస్తుంది. ఇది శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది.

Health risks of skipping breakfast and tiffin in the morning
మన రోజువారీ జీవనశైలిలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) అనేది ముఖ్యమైన భాగం. రాత్రి నిద్రపోయిన 8 నుండి 10 గంటల గ్యాప్ తర్వాత శరీరానికి కావలసిన శక్తిని పునరుద్ధరించేది బ్రేక్‌ఫాస్ట్. అందుకే ఇది మన రోజువారీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసమో, లేదా ఇంకా ఎదో కారణాల కోసమే ఉదయం టిఫిన్ చేయడం మానేస్తున్నారు. ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ దీని వల్ల అనేక ఆరోగ్యపరమైన నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
టిఫిన్ మానేయడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు:
1.మెటాబాలిజం మందగిస్తుంది:
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే శరీర మెటాబాలిజం స్థాయి క్షీనిస్తుంది. ఇది శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. దీనివల్ల శరీర బరువు పెరగడం మొదలవుతుంది.
2.బరువు పెరగడం:
చాలా మంది బరువు తగ్గడం కోసం టిఫిన్ చేయడం మానేస్తారు. కానీ, అలా చేయడం వల్ల ఇది బరువు తగ్గడం కాకుండా, మధ్యాహ్నం లేదా రాత్రి ఎక్కువ తినే అలవాటును కలిగించి, బరువు పెరిగే అవకాశం పెరుగుతుంది.
3.శక్తి లోపం:
నిద్ర లేచిన తర్వాత శరీరానికి ఎనర్జీ అవసరం. టిఫిన్ మానేస్తే, శరీరం తగిన శక్తిని పొందలేకపోవడం వల్ల అలసట, మంట, అధైర్యం వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులలో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
4.బ్లడ్ షుగర్ లెవల్స్ అస్థిరత:
బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పడిపోతాయి. దీని వల్ల బోసిపోవడం, డిజ్జినెస్, ఒత్తిడి, చిరాకు వంటి లక్షణాలు వస్తాయి. దీర్ఘకాలికంగా షుగర్ సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
5.దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు:
ఉదయం టిఫిన్ మానేయడం వల్ల ఆమ్లత, గ్యాస్, అలసట, అజీర్తి వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. పేగులు ఖాళీగా ఉండటంతో, ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీర్ఘకాలికంగా గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలు రావచ్చు.
6.ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనత:
ఉదయం తినే ఆహారం శరీరానికి విటమిన్లు, మినిరల్స్ అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, టిఫిన్ మానేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనమై, వైరల్స్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాద ఉంది.
ఆరోగ్యంగా ఉండాలంటే టిఫిన్ తప్పకుండా తినాలి:
- పౌష్టికాహార పదార్థాలు: ఇడ్లీ, దోస, ఉప్మా, పొంగల్, అవలక్కి
- ప్రొటీన్లు: పెసరట్టు, కోడిగుడ్డు, పాలు
- ఫైబర్: పండ్లు, గోధుమ రొట్టెలు
ఉదయం టిఫిన్ మానేయడం వల్ల శరీరానికి తక్షణ, దీర్ఘకాలిక నష్టాలు కలుగుతాయి. రోజును శక్తివంతంగా ప్రారంభించాలంటే, ఉదయం సరైన సమయానికి, సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్నా, 10 నిమిషాలు తీసుకుని టిఫిన్ తినడం మీ ఆరోగ్యాన్ని కాపాడే మంచి అలవాటు అవుతుంది.