Iron Calcium Supplements : ఐరన్, కాల్షియం సప్లిమెంట్లను కలిపి తీసుకోకూడదంటారు.. ఎందుకో తెలుసా?

Iron Calcium Supplements : ఐరన్, కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? ఈ రెండు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. కానీ, రెండు కలిపి ఒకేసారి తీసుకోకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Iron Calcium Supplements : ఐరన్, కాల్షియం సప్లిమెంట్లను కలిపి తీసుకోకూడదంటారు.. ఎందుకో తెలుసా?

Here's Why You Should Not Take Iron And Calcium Supplements Together

Iron Calcium Supplements : ఐరన్, కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? మానవ శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం అనే రెండూ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం కూడా అవసరం.

Read Also : Dubai Multiple-Entry Visa : భారతీయ పర్యాటకుల కోసం దుబాయ్ మల్టీ ఎంట్రీ వీసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలివే

జీవితంలో ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు అవసరం కావచ్చు. కానీ, చాలామందిలో ఐరన్, కాల్షియం తక్కువ అయితే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వైద్య నిపుణులు తరచుగా గర్భధారణ, చనుబాలివ్వడం రుతుస్రావం సమయంలో ఈ రెండింటిని సప్లిమెంట్లను ఇస్తుంటారు. అయితే, మీరు ఈ రెండు సప్లిమెంట్లను కలిపి తీసుకుంటే.. కలిగే కొన్ని దుష్ఫ్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐరన్, కాల్షియం సప్లిమెంట్లకు సరైన సమయం :
గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే.. ఈ రెండింటి మధ్య డోస్‌లను తప్పనిసరిగా పాటించడం చాలా అవసరం. పరిశోధన ప్రకారం.. కాల్షియంతో కలిపి తీసుకోవడం వల్ల ఐరన్ ఒంటికి పట్టడడానికి 40శాతం నుంచి 60శాతం వరకు తగ్గిస్తుంది. అందువల్ల, కాల్షియం సప్లిమెంట్లను అలాగే ఐరన్ సప్లిమెంట్లతో కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను నివారించడం మంచిది. ఐరన్ ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా ఒంటికి పడుతుంది. మీరు భోజనానికి ముందు తీసుకోవచ్చు.

అలాగే, ఐరన్ సప్లిమెంట్స్ మీ జీర్ణాశయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి సమయంలో ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదని అంటారు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుందని గుర్తుంచుకోండి. రెండు కలిపి తీసుకోవడం వల్ల వాటిలో అందాల్సినవి శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఐరన్ సప్లిమెంట్ల విషయంలో ఇవి గుర్తుంచుకోవాలి :

  • ఐరన్ తీసుకునే సమయంలో పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ తీసుకోండి.
  • మీరు ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి.
  • సూచించిన దానికంటే ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు.

Read Also : Caller Name Display : ట్రాయ్ కొత్త రూల్స్.. ట్రూకాలర్ మాదిరిగా ‘డిఫాల్ట్ కాలర్ నేమ్’ తప్పనిసరి..! ఈ సర్వీసుపై టెల్కోల అభిప్రాయమేంటి?