కరోనాకు వ్యాక్సిన్ ఎలా తయారవుతుంది? ఎప్పటికి రెడీ అవుతుంది? శాంతబయోటిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి ఏమంటున్నారు?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు మందు ఉందా? అది ఎలా తయారువుతోంది.. వ్యాక్సీన్‌తో వైరస్ కంట్రోల్ అవుతుందా? ఇదే సరైనా మందు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. వ్యాక్సీన్ తో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందా? అసలు కరోనా మెడిసిన్ ఎలా తయారువుతోంది. కరోనా మందు కోసం హైదరాబాద్‌లో పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి అనేది ఇప్పుడు చాలా అందరిలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి ఎన్నో సందేహాలపై అందరికి తెలియాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి.
కరోనా మందుకు సంబంధించిన మరిన్ని వివరాలను శాంతా బయోటిక్ చైర్మన్, వరప్రసాద్ రెడ్డి వివరించారు. కరోనా మందును కనిపెట్టడం రెండు నెలల్లో పూర్తి కాదు. వ్యాక్సీన్ లేదా మందును తయారు చేయడానికి కనీసం 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు సమయం పడుతుంది. వైరస్ వచ్చిన 2 నెలల్లోనే వ్యాక్సీన్ కనిపెట్టడం సాధ్యమయ్యేది కాదనే విషయం గుర్తించాలి. ఈ వ్యాక్సీన్ తయారు చేయడానికి ప్రక్రియ ఉంది. ఈ వైరస్‌ను గుర్తించి దాని సంబంధించి RNA, DNA వేరు చేసి దాన్ని ఒక ప్లాస్మిట్ లో పెట్టి ఒక మిడియంలో డెవలప్ చేయాల్సి ఉంటుంది.
వ్యాక్సీన్ రూపకల్పన చేయడానికి ఎనిమిది నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఈ వైరస్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో విరోధం కాకుండా వ్యాక్సీన్ ఇచ్చినప్పుడు ఇతర వేరే రకమైన ఇబ్బందులను కలగకుండా ఉండేందుకు అవసరమైన భద్రతా చర్యలను పరీక్షించాల్సి ఉంటుంది. దానికి చిన్న చిన్ని సిస్ అల్బినో మైస్ ఎలుకలపై వాటిపై ప్రయోగం చేస్తారు.
సాధారణంగా 70 కిలోల బరువుల గల వ్యక్తికి ఏదైనా వ్యాక్సీన్ 10ml లేదా 1ml మోతాదు వరకు ఇవ్వాల్సి వస్తే.. మూడు నుంచి నాలుగు గ్రాములున్న చిన్న ఎలుకల్లో 1ml కంటే 40 రెట్లు ఎక్కువగా వ్యాక్సీన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరిగితే ఏ జంతువు చనిపోకుండా ఉంటే అప్పుడే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది.
ఆ జంతువులోని ఏయే భాగాలు ఎలా ఉన్నాయి.. శ్వాసకోశాలు బాగున్నాయా, గుండె పనిచేస్తుందా? మూత్రపిండాలు బాగున్నాయా? అని పరిశీలించి నిర్ధారించిన తర్వాత రూపకల్పన నుంచి సేఫ్టీ వరకు రెండేళ్ల సమయం పడుతుంది. అప్పడు మాత్రమే మనుషులపైనా ప్రయోగానికి రెడీ అవుతుంది. శిశువులు, స్త్రీలు, పురుషులు.. మధ్య వయస్సులు, వృద్ధులను సేకరించి వారి సమ్మతికి సంబంధించి ప్రక్రియ మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సమయం పడుతుంది.
ఆ తర్వాత ప్రయోగంలో భాగంగా వారికి వ్యాక్సీన్ ఇచ్చాక అది పనిచేసిందా లేదా చెక్ చేయడానికి ఆరు నెలల నుంచి ఏడాదిన్నవరకు.. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఐదేళ్ల నుంచి ఆరేళ్ల వరకు పడుతుంది. వ్యాక్సీన్ వేగవంతంగా కనిపెట్టే ప్రక్రియ ప్రారంభమైతే కనీసం రెండేళ్ల నుంచి మూడేళ్లు సమయం పడుతుందని వరప్రసాదరెడ్డి చెప్పారు.మనం కనీస ఆహార నియమాలు, శుచి, శుభ్రత పాటించడం లేదన్నారు. మనం తీసుకునే ఆహారమే మనల్ని రక్షిస్తుంది. భారతీయుల ఆహార నియమాలే కరోనా వ్యాప్తిని కొంత వరకు కట్టడి చేస్తున్నాయని అన్నారు.