రోజూ చికెన్ తింటే…!

Eat Chicken Every Day: తెలుగు రాష్ట్రాల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. రోజూ ఏంటి ప్రతిపూటా చికెన్ బిర్యానీ తినమన్నా, చికెన్ కర్రీవేసుకోమన్నా ఎక్కువ మంది హ్యాపీ. మనకు తక్కువ ధరకు దొరికే ప్రొటీన్, కోడేకదా.
చికెన్‌రేట్ తక్కువ. కిలో రూ.200లకే అటూ ఇటు. భవిష్యత్తులోనూ రేటు కొంత తగ్గుతుందన్నది అంచనా. బ్రీడింగ్ టెక్నిక్, కోళ్లఫారాల సంఖ్య పెరగడం వల్ల సప్లయ్ పెరిగిపోతోంది. డిమాండ్‌లో అంత స్పీడులేదు. అందుకే రేటు కొంత తగ్గొచ్చన్నది ఇండస్ట్రీ మాట.
ఎప్పుడైతే కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్ సిటీల్లోకి వచ్చాయో చికెన్ వినియోగంకూడా బాగాపెరిగింది. sandwiches, salads, wraps, popcorn chickenలు. చాలాపేర్లు. చికెన్‌ను స్నాక్స్‌లాగా తినే ధోరణి కూడా బాగా పెరిగింది. ఇంతకీ రోజూ చికెన్ తింటే ఏమవుతుంది?
1. బరువు తగ్గొచ్చు
carbohydrates కన్నా Proteins జీర్ణంకావడానికి టైం పడుతుంది. రోజూ ఓ వంద గ్రామాలు చికెన్ తింటే కడుపునిండినట్లు ఫీలింగ్. ఆమేరకు రైస్ తగ్గిస్తారు.journal Appetiteలో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, intestinal hormones, insulin రిలీజ్ అయి, తినాలనే కోరికను తగ్గిస్తాయి.
చికెన్ తింటే మిగిలిన ఫాస్ట్‌ఫుడ్ చిరుతిండ్లు తగ్గుతాయంట. దాని వల్ల ఫైబర్ తక్కువగా ఉండే తిండిని పక్కనపెట్టొచ్చు. అంటే కొద్దిగా చికెన్ పొట్టలో వేస్తే, మిగిలిన తిండిని తగ్గిస్తాం. దానివల్ల బరువు తగ్గొచ్చు. నడుం చుట్టుకొలతలో మార్పు వస్తుంది. మీరు సన్నగా కనిపిస్తారు.
2.బరువు పెరగొచ్చు:
కీటోడైట్‌లో చికెన్‌ను ఎక్కువ తినమని చెబుతారు. పిండిపదార్ధాలు తగ్గించి, చికెన్ తింటే బరువుతగ్గుతారని చాలా స్టడీలున్నాయి. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రోజూ చికెన్ తింటే బరువు పెరగొచ్చు.
చికెన్ ఏం స్పెషల్ కాదు. నచ్చిందికదాని, లేదంటే తింటే తగ్గుతామన్న ఫీలింగ్‌తోనే ఎడాపెడా లాగించేస్తే, మీరు బరువు పెరగొచ్చు.
2015లో Clinical Nutritionలో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, రోజువారి తిండిలో 20శాతానికి మించి చికెన్‌తో సహా ఎలాంటి మాంసాన్నితిన్నా, బరువు పెరుగుతారని తేల్చేసింది. అంటే 20శాతం మేర తింటే పదిశాతం బరువు పెరుగుతారు.
చాలామందికి చికెన్ అంటే అంతా ప్రొటీన్ అనుకొంటారు. అందులోనూ కేలరీలుంటాయి. వాటిని ఖర్చుచేయకపోతే నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోతంది. అందువల్ల బరువు తగ్గడానికి చికెన్ తినాలనుకొనేవాళ్లు ఈ వార్నింగ్‌ను మార్చిపోవద్దు.
3. మజిల్ పెరుగుతుంది
కండ పెరగాలంటే ప్రొటీన్ ఉండాలి. రోజూ చికెన్ తింటే మజిల్ పెరగడానికి కావాల్సిన మెటీరియల్ అందుతుంది.
చికెన్ అంటే కంప్లీట్ ప్రొటీన్. leucine, amino acidలుంటాయి. అందువల్ల మజిల్ పెరిగే ప్రక్రియ స్పీడవుతుంది.
అదిసరే ఇంతకీ ఎంత తింటే కండపెరుగుతుంది? 2018 నాటి British Journal of Sports Medicine స్టడీ ప్రకారం శరీర బరువులో కిలోకి 1.6 గ్రాముల కండపట్టాలంటే 115గ్రాములు చికెన్ తినాలి. అదికూడా skinless breasts. టేస్ట్ బాగుంటుందని చికెన్ లెగ్స్ తిన్నారంటే కండకాదు, కొలస్ట్రాల్ పెరుగుతుంది.
4. మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ ఫ్యాట్ తింటున్నారు
saturated fats చికెన్‌లో తక్కువ. కాకపోతే బ్రాయిలర్ చికెన్స్‌లో ఫ్యాట్ ఎక్కువ. నాటుకోడికన్నా, వందేళ్ల క్రితంనాటి కోడికన్నా ఐదు నుంచి 10 రెట్లు ఎక్కువ కొవ్వుంది. వంద గ్రాముల చికెన్ లో 17 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. అందులో 5 గ్రాములు saturated fat.
5. గుండెజబ్బులు రావచ్చు
Hot dogs, sausage వంటి ప్రొసెస్డ్ చికెన్ కు గుండు జబ్బులు (cardiovascular disease)కి సంబంధముంది. red meat, processed meat, poultryలను వారానికి రెండుసార్లు తినేవాళ్లకు arteriesలో 3నుంచి 7శాతం వరకు ఎక్కువగా ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గుండెజబ్బులుకూడా ఏడుశాతం వరకు ఎక్కువగా వస్తాయి.
6. మలబద్దకం
ఆకుకూరలు, తృణధాన్యాలను కాదని చికెన్ ఎక్కువగా తింటే మీకు మలబద్ధకం రావచ్చు. ఎందుకంటే హై ప్రొటీన్స్ డైట్స్‌లో ఫైబర్ తక్కువ. రాత్రిపూట చికెన్ తింటే తిన్నది అరగక టాయిలెట్‌లో గంటలకొద్ది వెయిట్ చేయాలి. ఇది ఇబ్బందేకదా. అందుకే చికెన్ ప్లేట్‌లో కేరట్స్, బ్రౌన్‌రైస్, విజిటబుల్ సలాడ్స్ కూడా చేర్చమంటున్నారు సైంటిస్ట్‌లు.
7. ఫ్రైడ్‌చికెన్ తింటే ఆయుష్షు తగ్గుతుంది
107,000 మహిళల మీద దీర్ఘకాలం అధ్యయనం చేశారు. రోజూ ఫ్రైడ్ చికెన్ తినేవాళ్లో44% మంది లావు. అప్పుడు చికెన్ ఇవ్వడం మానేశారు. ఎక్సర్ సైజెస్ లేక వాళ్లు బరువుకూడా తగ్గలేదు. కాకపోతే ఫ్రైడ్ చికెన్ లాంటి తిండిని ఎక్కువగా తింటే గుండెజబ్బులు వస్తాయని తేలింది.
ఫ్రైడ్‌ఫుడ్ రెగ్యులర్‌గా తినే వాళ్లలో 13శాతం ఎక్కువగా గుండె సమస్యలొస్తాయి. అంటే మరణాల రేటు కూడా పెరగొచ్చుకదా.
మొత్తంమీద చెప్పేది ఒక్కటే చికెన్ అంత ప్రమాదకరమైంది కాదు. రోజూ తినొచ్చు. కాకపోతే ఫైబర్ కూడా తింటే ఆరోగ్యసమస్యలను అధిగమించొచ్చు.