Nail Health Tips: చేతి గోళ్లలోనే ఆరోగ్యం.. తెల్లగా ఉంటే ఈ సమస్యలు ఉన్నట్టే.. ఒకసారి చెక్ చేసుకోండి
Nail Health Tips: ఆరోగ్యాంగా ఉండే గోళ్లు గులాబీ రంగులో ఉండాలి, గోళ్లు మృదువుగా, మగ్గంగా ఉండాలి. గోళ్లు మిలమిలలాడే మెరుపుతో ఉండటం పూర్తి ఆరోగ్యానికి సూచిక.

Is discoloration of fingers an indicator of illness?
మన శరీరంలోని ఆరోగ్య సమస్యలను మనం వెలుపల చూసే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. వాటిలో గోళ్ల ఆరోగ్యం ఒక ముఖ్యమైన సూచిక. చేతి గోళ్లతో మన ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. గోళ్లు ఎర్రగా లేదా లేత గులాబీ రంగులో ఉంటే ఎలాంటి సమస్య లేదు. కానీ, తెల్లగా (Pale or White Nails) కనిపిస్తే మాత్రం ఇది అనారోగ్యానికి సంకేతం అని చెప్తున్నారు నిపుణులు. శరీరంలో ఏదో లోపం లేదా వ్యాధి సూచన కావచ్చట. మరి చేతి గోళ్లు తెల్లగా మారడానికి కారణం ఏంటి?అవి సూచించే ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉన్న గోళ్లు ఎలా ఉండాలి?
ఆరోగ్యాంగా ఉండే గోళ్లు గులాబీ రంగులో ఉండాలి, గోళ్లు మృదువుగా, మగ్గంగా ఉండాలి. గోళ్లు మిలమిలలాడే మెరుపుతో ఉండటం పూర్తి ఆరోగ్యానికి సూచిక. కానీ, ఇవి తెల్లగా మారితే అది ప్రమాద సంకేతం అని చెప్పుకోవచ్చు.
చేతి గోళ్లు తెల్లగా మారడం వల్ల సూచించే ఆరోగ్య సమస్యలు:
1.రక్తహీనత (Anemia):
శరీరంలో ఐరన్, విటమిన్ B12 లోపం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల గోళ్ల క్రింద రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల అవి తెల్లగా మారే అవకాశం ఉంది.
2.లివర్ సంబంధిత సమస్యలు:
లివర్ డిసీస్ లేదా హెపటైటిస్ ఉన్నవారిలో కూడా గోళ్లు తెల్లగా మారడం జరుగుతుంది. దీని అర్థం శరీరంలో టాక్సిన్స్ శుద్ధి కావడం లేదని. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో జాగ్రత్తలు అవసరం.
3.హృదయ సంబంధిత వ్యాధులు:
గుండె పూర్వస్థితిని కోల్పోయినప్పుడు శరీర భాగాలకు సరైన రక్తసరఫరా జరగదు. అలాంటి సమయంలో కూడా గోళ్లు, పెదవులు, చర్మం తెల్లగా మారే అవకాశం ఉంది.
4.కిడ్నీ వ్యాధులు:
క్రానిక్ కిడ్నీ సమస్య ఉన్నవారిలో కూడా గోళ్లు పసుపు లేదా తెల్లగా మారడం కనిపిస్తుంది. ఇది శరీరంలో యూరియా పేరుకుపోవడం వల్ల జరిగే మార్పులు.
5.పోషకాహార లోపాలు:
గోళ్లు తెల్లగా మారడం అనేది పోషకాహార లోపం వల్ల కూడా జరుగుతుంది. జింక్, కాల్షియం, బయోటిన్ వంటి పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు గోళ్లు తెల్లంగా మారే అవకాశం ఉంది. పొట్టలో గజ్జి, కీటకాలు ఉన్నప్పుడూ కూడా గోళ్లు రంగును కోల్పోతాయి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఐరన్, విటమిన్ B12, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
- పాల, పన్నీర్, గుడ్లు, ఆకుకూరలు, తేనె, బాదం వంటివి ఆహారంలో చేర్చుకోవాలి
- రోజూ నీరు బాగా త్రాగాలి, శరీరం హైడ్రేటెడ్ గా ఉంచాలి