పరిశోధనలో ఆశ్చర్యకర ఫలితాలు.. తెల్లవారుజామున లేవడం కంటే ఆలస్యంగా నిద్రలేస్తేనే మంచిదా?

మన దేశంలో పిల్లలను తల్లిదండ్రులు త్వరగా పడుకోబెట్టి ఉదయాన్నే లేపుతుంటారు. ఇటువంటి అలవాటే అన్నింటికన్నా ఉత్తమమైందని ఇన్నాళ్లు భావించాం.

పరిశోధనలో ఆశ్చర్యకర ఫలితాలు.. తెల్లవారుజామున లేవడం కంటే ఆలస్యంగా నిద్రలేస్తేనే మంచిదా?

Updated On : October 13, 2024 / 4:18 PM IST

నిద్ర ఓ ఔషధం వంటిదని డాక్టర్లు చెబుతుంటారు. గాఢంగా నిద్రపడితే ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. అలాగే, మన శరీరం అన్ని రకాల పనులను సమర్థంగా చేయగలుగుతుంది. మన దేశంలో పిల్లలను తల్లిదండ్రులు త్వరగా పడుకోబెట్టి ఉదయాన్నే లేపుతుంటారు.

ఇటువంటి అలవాటే అన్నింటికన్నా ఉత్తమమైందని ఇన్నాళ్లు భావించాం. అయితే, తెల్లవారుజామున లేవడం కంటే ఆలస్యంగా నిద్రలేస్తేనే మరింత మేలు కలుగుతుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు నిద్రపై చేసిన కొత్త పరిశోధన ఫలితాలను న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

రాత్రి ఆలస్యంగా పడుకుని, ఉదయం ఆలస్యంగా లేచేవారి కాగ్నిటివ్ ఫంక్షన్ (అభిజ్ఞా పనితీరు) మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 26,000 మంది వ్యక్తులపై ఈ పరిశోధన చేశారు. ఆలస్యంగా మేల్కొనే వారు ఇంటెలిజెన్స్, రీజనింగ్, జ్ఞాపకశక్తి పరీక్షల్లో మెరుగైన స్కోరు సాధించారు.

ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిళ్లు, ఉద్యోగాల్లో షిఫ్టులు వంటి కారణాలతో రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారని ఓ వైద్యుడు తెలిపారు. ఇటువంటి వారికి.. పరిశోధకులు తాజాగా గుర్తించిన అంశం ఎంతో ఉపశమనం కలిగించేలా ఉందని చెప్పారు.

ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్రమాత్రం ఉండాలని అన్నారు. ఏడు గంటల కంటే తక్కువ లేదా తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవాళ్లలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

ఎవరీ బాబా సిద్ధిఖీ.. ఆయనకు అంత గుర్తింపు ఎలా వచ్చింది?